Oscars 2022: ఆస్కార్ సందడి షురూ అయింది. మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ పురస్కార వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎంతైనా సినీ ప్రేమికులకు కూడా ఆస్కార్ అవార్డ్ ఓ కలల స్వప్నం. అందుకే.. ప్రపంచ సినీ లోకంలో ఆస్కార్ కి తిరుగులేకుండా పోయింది. ఒక్కసారైనా ఆస్కార్ అవార్డ్ ను అందుకోవాలని, కనీసం ఆస్కార్ కోసం పోటీపడాలని కలలు కంటూ కాలం వెళ్లదీస్తూ ఉంటారు. ఇక ఆస్కార్ పోటీలో వివిధ విభాగాల్లో పోటీపడ్డాయి పలు చిత్రాలు.

అయితే.. వాటి నుంచి తుది జాబితాను కమిటీ ప్రకటించింది. ‘ది పవర్ ఆఫ్ డాగ్’ చిత్రం 12నామినేషన్లతో ముందు వరుసలో నిలిచింది. ఇక మన ‘జైభీమ్’ ఆస్కార్ రేసు నుంచి నిష్క్రమించగా.. ఇండియన్ డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’ బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌గా నామినేటైంది. నిజానికి ‘జైభీమ్’ ఆస్కార్‌కు షార్ట్ లిస్ట్ అవ్వకపోవడంతో నిరాశ చెందారు సినీ అభిమానులు. కానీ భారత్ తరపున ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ.. ఆస్కార్‌కు బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌గా నామినేటైంది. దాంతో భారతీయ ప్రేక్షకులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.
Also Read: హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్‌లో 85 ఉద్యోగ ఖాళీలు.. బీటెక్ అర్హతతో?

కాగా ‘ఖబర్ లహారియా’ అనే పత్రికను నిర్వహిస్తున్న దళిత మహిళల కథ స్ఫూర్తిగా ఈ డాక్యుమెంటరీను తెరకెక్కించారు. MAR 27న అవార్డుల ప్రదానోత్సనం జరగనుంది.
బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌గా ‘రైటింగ్ విత్ ఫైర్’ ఇక ఆస్కార్ నిర్వాహకులు ప్రకటించిన విదేశీ చిత్రాల్లో డ్రైవ్ మై కార్(జపాన్), ఫ్లీ(డెన్మార్క్), ది హ్యండ్ ఆఫ్ గాడ్(ఇటలీ), లునానా(భూటాన్), ది వరస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్(నార్వే) ఫైనల్‌కు నామినేట్ అయ్యాయి.
కానీ సూర్య ఫ్యాన్స్ ఆశలు గల్లంతయ్యాయి. కాగా, అక్కడివరకు మన సినిమా వెళ్లడం గర్వకారణమంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు సూర్య ఫ్యాన్న్.