సినిమా: “అనోరా”
దర్శకుడు: శోన బేకర్
నటీనటులు: మైకి మాడిసన్, మార్క్ ఎడెల్‌స్టేన్, యూరా బొరిసోవ్
రన్నింగ్ టైం: 139 నిమిషాలు
Oscar Awards 2025: ప్రతిష్టాత్మక ఆస్కార్ 2025 అవార్డుల వేడుక అమెరికా లాస్‍ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో అంగరంగ వైభవంగా జరిగింది. 2024లో వచ్చిన చిత్రాలకు సంబంధించి ఈ 97వ అకాడమీ అవార్డుల వేడుక సాగింది. హాలీవుడ్ సినిమా స్టార్లు ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల ఈవెంట్‍కు కొనాన్ ఓబ్రెయిన్ హెస్ట్ చేశారు.’అనోరా’ చిత్రానికి ఐదు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు అందుకుంది. ఇందులో ఈ మూవీకి గాను ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ స్క్రీన్‍ప్లే, ఉత్తమ ఎడిటింగ్ విభాగాల్లో నాలుగు అవార్డులను సొంతం చేసుకున్నారు శోన బేకర్.
Also Read: ఆస్కార్-2025 విన్నర్స్ వీళ్లే.. ఉత్తమ నటుడు, నటి ఎవరంటే ?
భారీ బడ్జెట్ చిత్రాలు రాజ్యమేలుతున్న ఈ సమయంలో విభిన్న కథనంతో అనోరా తెరకెక్కింది. రెడ్ రాకెట్, ది ఫ్లోరిడా ప్రాజెక్ట్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన శోన్ బేకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమానే అనోరా. మైకీ మాడిసన్, మార్క్ ఎడిల్జియన్ ప్రధాన పాత్రల్లో నటించారు. రొమాంటిక్ కామెడీ డ్రామా కథాంశంతో నేపథ్యంలోనే దీన్ని తెరకెక్కించారు. ‘అని’ అనే 23 ఏళ్ల వేశ్య చుట్టూ ఈ చిత్ర కథ తిరుగుతూ ఉంటుంది. బ్రూక్లిన్‌లో నివసించే ఆమె తన వృత్తిలో భాగంగా ఓ రోజు రష్యన్ ఒలిగార్క్ కుమారుడు వన్యకు కలుస్తుంది. అనిపై ప్రేమను పెంచుకున్న అతడు ఆమెను సీక్రెట్ గా పెళ్లి చేసుకుంటాడు. ఓ రిచెస్ట్ మ్యాన్ వేశ్యను చేసుకోవడం సర్వత్రా ఆశ్చర్యం కలిగిస్తుంది. చివరకు రష్యాలో ఉంటున్న వన్య పేరెంట్స్ కు విషయం తెలుస్తుంది. తమ కుమారుడు అమాయకుడని మాయమాటలతో పెళ్లి చేసుకుందంటూ ఆమెను నిందిస్తారు. తమ కుమారుడిని వదిలేస్తే 10 వేల డాలర్లు ఇస్తామని కోరుతారు. మరి, అని వారిచ్చిన ఆఫర్‌ను స్వీకరించి.. వన్యను వదిలేసిందా? చివరకు ఆమె జీవితం ఏమవుతుందని అనే కథతో సినిమా తెరకెక్కింది.
2024 అక్టోబర్ లో ఇది విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. సుమారు 6 మిలియన్ డాలర్ల (మన కరెన్సీలో సుమారు రూ.52 కోట్లు)తో దీనిని రూపొందించారు. 41 మిలియన్ డాలర్లు ( మన కరెన్సీలో దాదాపు రూ.358కోట్లు) అందుకుని బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించింది. శీన బేకర్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు (గ్రాస్) రాబట్టిన చిత్రంగా అనోరా నిలిచింది.
ప్రస్తుతం అనోరా చిత్రం అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీ+లో స్ట్రీమింగ్ అవుతుంది. రెంటల్ ప్రాసెస్ లో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల్లో విడుదల చేసిన ఈ సినిమా చూడాలంటే డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
Also Read: మహేష్ బాబు కోసం రెడీ చేసిన కథను లాక్కున్న స్టార్ హీరో ఎవరో తెలుసా..?