Mahesh Babu : సినిమా ఇండస్ట్రీకి రావాలని, ఇక్కడ స్టార్ హీరోగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కలలు కంటూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రమే వాళ్ళు కన్న కలలను సహకారం చేసుకుంటారు. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో రోజులపాటు అవకాశం కోసం వేచి చూడాలి, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే సత్తా ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అనేది దక్కుతుంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే వారసత్వం గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది హీరోలు స్టార్ హీరోలుగా ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మన వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని అలరించడమే కాకుండా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ (Krishna) నట వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు(Mahesh Babu) సైతం భారీ విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఆయన రాజమౌళి డైరెక్షన్ లో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో ఎవరికి సాధ్యం కానీ రీతిలో హాలీవుడ్ లో తను స్టార్ హీరోగా మారిపోతున్నాడనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు… అయితే మహేష్ బాబు తన కెరీర్ మొదట్లో భారీ సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నాడు. అయినప్పటికి ఒక సూపర్ హిట్ స్క్రిప్ట్ మహేష్ బాబు దగ్గరికి వచ్చిందట.
Also Read : మహేష్ బాబు తో నరకం స్పెల్లింగ్ రాయిస్తున్న రాజమౌళి…పాన్ వరల్డ్ సినిమా అంటే అలానే ఉంటుంది మరి…
ఆ స్క్రిప్ట్ ను చేయాల వద్దా అనే డెసిజన్ తీసుకునే లోపే జూనియర్ ఎన్టీఆర్ లాగేసి బృందావనం అనే సినిమా చేసి సూపర్ డూపర్ సక్సెస్ ని కొట్టాడంటు అప్పట్లో కొన్ని వార్తలైతే వచ్చాయి. మొదట ఈ మూవీ డైరెక్టర్ అయిన వంశీ పైడిపల్లి (Vamshi Paidipalli) మహేష్ బాబుకి ఈ కథ వినిపించారట.
మహేష్ బాబు తను అప్పటికే ఖలేజా సినిమా చేస్తున్నాడు. దాంతో ఈ సినిమా చెయ్యాలా వద్దా అని ఆలోచించుకునే సమయంలోనే దిల్ రాజు ప్రోత్సాహంతో జూనియర్ ఎన్టీఆర్ ఈ కథని తను చేస్తానని చెప్పి సినిమా చేసి భారీ విజయాన్ని అందుకున్నాడు… మొత్తానికైతే ఒక సూపర్ హిట్ సినిమా ను మహేష్ బాబు కోల్పోయాడనే చెప్పాలి…
ఇక అప్పట్లో బృందావనం సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఎన్టీఆర్ కి కూడా కెరియర్ పరంగా సినిమా చాలావరకు బుస్టాప్ ఇచ్చిందనే చెప్పాలి. అంతకు ముందు వరకు ఫ్లాపుల్లో ఉన్న ఎన్టీఆర్ కి బృందావనం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ అయితే దక్కింది…
Also Read : మహేష్ బాబు చేసిన ఆ సినిమా ప్లాప్ అవ్వాలని కోరుకున్న కృష్ణ…కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..?