Oscars 2025 winners: 97వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 3న భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30 గంటలకు అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ఉత్తమ నటుడు, ఉత్తమ నటీ సహా అనేక విభాగాలలో అవార్డులను అందించింది.
సినీ ప్రపంచంలో అత్యున్నత అవార్డుగా పరిగణించే ఆస్కార్ అవార్డుల సంబరం అంగరంగ వైభవంగా జరిగింది. రొమాంటిక్ కామెడీ డ్రామా ‘అనోరా’కు (Anora) అవార్డులు వెల్లువలా వచ్చాయి. బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ హీరోయిన్, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్ విభాగాల్లో అవార్డులను అందుకుంది. ‘ది బ్రూటలిస్ట్’లో నటనకు గానూ త్తమ నటుడిగా అడ్రియన్ బ్రాడీ.. ‘అనోరా’లో నటనకు మైకీ మ్యాడిసన్ ఉత్తమ నటిగా ఈ అవార్డు అందుకున్నారు. సీన్ బేకర్ (అనోరా) ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నారు.
ఇక ‘ఎ రియల్ పెయిన్’ చిత్రానికి హాలీవుడ్ నటుడు కీరన్ కుల్కిన్ ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు.‘ఎమిలియా పెరెజ్’లో నటనకు జోయా సాల్దానా ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకున్నారు. గతేడాది బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించినటువంటి ‘డ్యూన్: పార్ట్2’ ఉత్తమ సౌండ్, విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ఇక లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో మన దేశం నుంచి నామినేషన్‌లో నిలబడిన ‘అనూజ’ చిత్రానికి నిరాశ ఎదురైంది. ఆ కేటగిరిలో ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ ఉత్తమ లఘు చిత్రంగా ఆస్కార్ అందుకుంది. గెలుచుకుంది.
ఆస్కార్ విజేతల పూర్తి జాబితాను కింద చూడవచ్చు.
ఆస్కార్ 2025 విజేతలు
* ఉత్తమ చిత్రం – అనోరా
* ఉత్తమ నటుడు – అడ్రియన్ బ్రాడీ (చిత్రం: ది బ్రూటలిస్ట్)
* ఉత్తమ నటి – మికేలా మాడిసన్ (చిత్రం: అనోరా)
* ఉత్తమ దర్శకుడు – సీన్ బేకర్ (చిత్రం: అనోరా)
* ఉత్తమ యాక్షన్ లైవ్ షార్ట్ ఫిల్మ్ – ఐ యామ్ నాట్ ఎ రోబోట్
* ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రం – ఐయామ్ స్టిల్ హియర్
* ఉత్తమ సినిమాటోగ్రఫీ – ది బ్రూటలిస్ట్
* ఒరిజినల్ స్కోర్ – ది బ్రూటలిస్ట్
* డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్- నో అదర్ ల్యాండ్
* డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్- ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
* ఉత్తమ సహాయ నటి – జోయ్ సల్దానా (చిత్రం: ఎమిలియా పెరెజ్)
* ఉత్తమ ఒరిజినల్ సాంగ్ – ఎల్ మాల్ (చిత్రం: ఎమిలియా పెరెజ్)
* ఉత్తమ సహాయ నటుడు – కీరన్ కుల్కిన్ (చిత్రం: ది రియల్ పెయిన్)
* ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ – ఫ్లో
* ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ – ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రస్
* ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ – పాల్ టేజ్‌వెల్ (చిత్రం: వికెట్)
* ఉత్తమ స్క్రీన్ ప్లే – అనోరా
* ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే – పీటర్ స్ట్రాఘన్ (చిత్రం: కాన్‌క్లేవ్)
* ఫిల్మ్ ఎడిటింగ్ – అనోరా
* ఉత్తమ సౌండ్ – డ్యూన్: పార్ట్ 2
* ఉత్తమ VFX – డ్యూన్: పార్ట్ 2
ఆస్కార్ అవార్డు సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఈ అవార్డును ప్రతి సంవత్సరం అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ప్రదానం చేస్తుంది. 2023 సంవత్సరంలో నిర్మాత గునీత్ మోంగా చిత్రం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో అవార్డును గెలుచుకుంది. ఈసారి కూడా గునీత్ మోంగా చిత్రం ‘అనూజ’ ఈ అవార్డును గెలుచుకునే రేసులో ఉంది. ఇది ఉత్తమ యాక్షన్ లైవ్ ఫిల్మ్ విభాగంలో నామినేట్ అయింది. కానీ దానికి నిరాశ ఎదురైంది. ఈ విభాగంలో ‘ఐయామ్ నాట్ ఏ రోబో’ చిత్రం అవార్డు గెలుచుకుంది.