Nara Lokesh Delhi Tour
Nara Lokesh Delhi Tour : లోకేష్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయితే ఆయన అధికారికంగా పర్యటించడం లేదు. షెడ్యూల్ కూడా ప్రకటించలేదు. ఇది పూర్తిగా రాజకీయ పర్యటన అని తెలుస్తోంది. ఢిల్లీలో కీలక నేతలను వరుసగా కలుస్తున్నారు. సమావేశాలు నిర్వహిస్తున్నారు. రెండు ఎజెండాలతో లోకేష్ ఢిల్లీ పర్యటనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. రాష్ట్రంలో సైతం టిడిపి తో కలిసి బీజేపీ అధికారం పంచుకుంటుంది. అందుకే నామినేటెడ్ పదవుల విషయంలో కేంద్ర పెద్దల అనుమతి తీసుకోవడానికి లోకేష్ ఢిల్లీ వెళ్లినట్లు తెలుస్తోంది.రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవుల నియామకం విషయంలో లోకేష్ యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు.ఒక క్రమ పద్ధతిలో నియామకం జరగాలని లోకేష్ భావిస్తున్నారు.అందుకే కేంద్ర పెద్దలను సంప్రదించినట్లు తెలుస్తోంది.
* వైసీపీని ఇరుకున పెట్టేందుకు
మరోవైపు రాష్ట్రంలో వైసీపీని ఇరుకున పెట్టే చర్యలు ముమ్మరం అవుతున్నాయి. ప్రధానంగా ముంబై నటి కదంబరి జెత్వాని కేసు విషయంలో ఐపీఎస్ లపై పట్టు బిగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో వైసిపి కీలక నేత ప్రమేయం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఒక వైసీపీ నేత అరెస్టు కూడా జరిగింది. మిగిలిన వారిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ కేసు విషయంపై సైతం లోకేష్ కేంద్ర పెద్దలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
* కేంద్రం సీరియస్
తాజాగా తిరుపతి లడ్డు వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. జాతీయస్థాయిలో సంచలనంగా మారింది. అటు ఆర్ఎస్ఎస్ తోపాటు విశ్వహిందూ పరిషత్ సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కేంద్రంలో టిడిపి భాగస్వామి కావడం.. హిందూ సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావిస్తుండడంతో.. కేంద్రం కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే లోకేష్ కేంద్ర పెద్దలతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసు విషయంలో మరింత పట్టు బిగించాలన్నది లోకేష్ వ్యూహంగా తెలుస్తోంది.
*ప్రకంపనలు
లోకేష్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో వైసీపీలో ప్రకంపనలు రేగుతున్నాయి. లడ్డు వివాదం ఎటువైపు దారితీస్తుందో నన్న ఆందోళన కనిపిస్తోంది. ఒకవేళ ప్రభుత్వం అరెస్టులకు దిగితే పరిస్థితి ఏంటిఅన్న డిఫెన్స్ వైసీపీలో వ్యక్తమౌతోంది. గతంలో చంద్రబాబు అరెస్టు సమయంలో లోకేష్ ఢిల్లీలో కీ రోల్ ప్లే చేశారు.మరోసారి లోకేష్ ఢిల్లీలోనే పాగా వేయడం,కేంద్ర ప్రజలకు చర్చలు జరపడంతో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.