ఆల్ టైమ్ రికార్డులను తిరగారస్తున్న మరో రికార్డు కొల్లగొట్టిందని తాజాగా గీతా ఆర్ట్స్ సంస్థ ప్రకటించింది. ‘అలవైకుంఠపురములో’ మ్యూజిక్ ఆల్బమ్ కి యూట్యూబ్లో బిలియన్ వ్యూస్(వందకోట్లు) వచ్చినట్లు ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఒక తెలుగు చిత్రానికి ఇంత భారీ స్థాయిలో ప్రజల ఆదరణ లభించడం తొలిసారి అని పేర్కొంది. తమ చిత్రాన్ని ఆదరించడంతోపాటు ఆల్బమ్ ను ఇంత పెద్ద సక్సస్ చేసిన ప్రతీఒక్కరికి కృతజ్ఞతలు అంటూ గీత ఆర్ట్స్ సంస్థ ట్వీట్ చేసింది. ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో బుట్టబొమ్మ సాంగ్ నిత్యం ట్రెండింగ్ అవుతూనే ఉంది. టిక్ టాక్, సోషల్ మీడియాలో పలువురు సెలబెట్రీలు బుట్టబొమ్మ సాంగ్ కు డ్యాన్స్ చేసి షేర్ చేస్తున్నారు. ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్న్ బుట్టబొమ్మ సాంగ్ కు ఫ్యామిలీతో సహా డాన్స్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం ఆకట్టుకుంది.