Online Ticket Portal Tender Issue: మెగా ఫ్యామిలీ అంటే.. పరిశ్రమకు హీరోలను అందిస్తున్న ఫ్యామిలీ మాత్రమే కాదు.. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో రకాలుగా మెగా ఫ్యామిలీ పాతుకుపోయింది. ఓటీటీ సంస్థ దగ్గర నుంచి నిర్మాణం, చివరకు డిస్ట్రిబ్యూషన్ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జస్ట్ టిక్కెట్ అనే సంస్థ కూడా మెగా ఫ్యామిలీకి చెందిన వ్యక్తులదే.

కాగా ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ను ఈ జస్ట్ టిక్కెట్ సంస్థకి ఇవ్వాలని ప్లాన్ చేసింది ఏపీ ప్రభుత్వం. ఇందుకు అంతా సిద్ధమైందని కూడా ప్రచారం చేశారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచే జస్ట్ టిక్కెట్ సంస్థ నుంచే ఇక ఏపీ వాసులు టిక్కెట్లు కొనాలనేలా ఉత్తర్వులు జారీ చేస్తున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే, ఏప్రిల్ 1వ తేదీ వెళ్ళిపోయి నేటికీ మూడు రోజులైంది.
Also Read: Mudragada Padmanabham- ABN RK: అసలు అంశాలు వదిలి కొసరుపైనే క్లారిటీ.. ఇదేంది రాధాక్రిష్టగారు
కానీ.. జస్ట్ టిక్కెట్స్ సంస్థకి మాత్రం ప్రభుత్వం ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ను ఇవ్వలేదు. ప్రభుత్వానికి కూడా ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంగీకారమే అయినప్పుడు.. మరి ఎందుకు ఇంకా ఇవ్వలేదు అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. కాంట్రాక్ట్ ను మీకే ఇస్తున్నాం అని జస్ట్ టిక్కెట్స్ సంస్థకి ప్రభుత్వ పెద్దలు నుంచి హామీ కూడా వచ్చింది. కానీ ఉత్తర్వులు మాత్రం ఇంకా వెలువడలేదు.

ఇప్పుడు ఇదే టాలీవుడ్‌లో హాట్ టాపిక్. ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ ను ‘జస్ట్ టిక్కెట్స్’కు ఇంకా ఇవ్వకపోవడానికి మెయిన్ కారణం.. మరో సంస్థ కూడా పోటీలో ఉందట. ఏపీ ఆన్ లైన్ టిక్కెట్ల కాంట్రాక్ట్ కోసం ఆ సంస్థ.. ‘జస్ట్ టిక్కెట్స్’ కన్నా తక్కువ కమిషన్ తీసుకుంటామని ముందుకు వచ్చింది అట. పైగా ఆ సంస్థ తక్కువకే రివర్స్ టెండరింగ్ కూడా వేసింది.
ఈ కారణంగానే ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందని.. రెండు సంస్థలతో చర్చలు జరిపి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటే మంచిది అనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
Also Read:Sri Lanka Crisis: శ్రీలంక దుస్థితి ఏ దేశానికి రాకూడదా?