Sandhya Theatre Incident: గత ఏడాది సరిగ్గా ఇదే రోజున రాత్రి సమయం లో పుష్ప 2(Pushpa 2 Movie) ప్రీమియర్ షోలు పడగా, హైదరాబాద్ లోని సంధ్య థియేటర్ కి అల్లు అర్జున్(Icon star Allu Arjun) రావడం, ఆ సమయం లో అదుపు తప్పిన అభిమానులను కంట్రోల్ చేసే క్రమం లో భారీ తొక్కిసలాట జరగడం, ఈ ఘటన లో రేవతి అనే అమ్మాయి చనిపోవడం, ఆమె కొడుకు శ్రీ తేజ్ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం, ఇవన్నీ ఎంతటి దుమారం రేపాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలంగాణ ప్రభుత్వం ఈ అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకోవడమే కాదు, బాధ్యతారాహిత్యం గా వ్యవహరించిన అల్లు అర్జున్ ని అరెస్ట్ కూడా చేశారు. దేశవ్యాప్తంగా ఈ అంశం నెల రోజుల పాటు హాట్ టాపిక్ గా మారింది. అయితే అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్యం కుదుట పడేందుకు చికిత్స కి అవసరమయ్యే డబ్బులు ఇవ్వడమే కాకుండా, కోటి రూపాయలకు పైగా డబ్బులు కూడా ఇచ్చాడు.
అయితే మూడు నెలల క్రితం శ్రీతేజ్ ఆరోగ్యం కాస్త కోలుకుందని, ఆయన్ని రిహాబిలిటేషన్ సెంటర్ కి తరలిస్తున్నామని అతని తండ్రి చెప్పడం తో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. కానీ శ్రీతేజ్ ప్రస్తుత పరిస్థితి పై ఆయన తండ్రి మాట్లాడిన మాటలు చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు. శ్రీతేజ్ ఇప్పటికీ తన ఆహరం తానూ తీసుకోలేకపోతున్నారు అట. అంతే కాకుండా మనుషులను గుర్తు పట్టలేకపోతున్నాడు అట. ఇప్పటికీ అతను బెడ్ మీద నుండి కదలలేని పరిస్థితిలోనే ఉన్నాడట. శ్రీతేజ్ తండ్రి మీడియా తో మాట్లాడుతూ, ప్రతీ నెల చికిత్స కోసం లక్షా 50 వేల రూపాయిలు అవుతున్నాయట. తమ ఆర్ధిక స్తోమత సరిపోక అల్లు అర్జున్ మ్యానేజర్ ని సంప్రదిస్తే, అతను స్పందించడం లేదని చెప్పుకొచ్చాడు. దీంతో మరోసారి శ్రీతేజ్ ఇప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే దీనిపై బన్నీ వాసు కాసేపటి క్రితమే రియాక్ట్ అయ్యాడు.
ఆయన మాట్లాడుతూ ‘దిల్ రాజు లాంటి పెద్ద మనుషులు ఆ అంశం లో మాకు సరైన సూచనలు ఇస్తున్నారు. శ్రీతేజ్ చికిత్స కు ఎంత డబ్బు అవసరం ఉంటుంది?, అతని కుటుంబ పోషణకు ఎంత డబ్బులు కావాలి?, ఇలా ప్రతీ ఒక్కటి దిల్ రాజు గారు చెప్పినట్టుగానే చేస్తున్నాం. అయినప్పటికీ శ్రీతేజ్ కుటుంబ సబ్యులకు అవి సరిపోవడం లేదంటే, పెద్దలను కలవొచ్చు. వాళ్ళు ఏది చెప్తే మేము అది అనుసరిస్తాము’ అంటూ చెప్పుకొచ్చాడు బన్నీ వాసు. చూడాలి మరి ఈ అంశం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుంది అనేది.
Is #AlluArjun Not Taking Enough Care of Theatre Stampede Victim SriTej?
Here is What Bunny Vas Says: pic.twitter.com/9i8UhryZdA
— Movies4u Official (@Movies4u_Officl) December 4, 2025