HomeతెలంగాణSentiment Politics: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్‌ రాజకీయం.. ఈసారి కాంగ్రెస్‌ వంతు!

Sentiment Politics: తెలంగాణలో మళ్లీ సెంటిమెంట్‌ రాజకీయం.. ఈసారి కాంగ్రెస్‌ వంతు!

Sentiment Politics: తెలంగాణలో రాజకీయాలు మారుతున్నాయి. తెలంగాణ సెంటిమెంటును వాడుకోవాలని, తద్వారా మరో ఐదేళ్లు అధికారంలో ఉండేలా చూసుకోవలని రేవంత్‌ సర్కార్‌ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. వైఎస్సార్‌ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకున్నారు. తర్వాత తెలంగాణ వాదాన్ని అణచివేయాలని చూశారు. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడం కోసం తెలంగాణ వాదాన్ని పునరుద్ది పెడుతున్నట్లు అనిపిస్తోంది.

తెలంగాణ ఉద్యమ వేదిక నుంచి..
రాజశేఖరరెడ్డి తెలంగాణ వాదం ప్రారంభించినా.. తర్వాత వ్యతిరేకించాడు. వైఎస్సార్‌ మరణం తర్వాత ఉద్యమం మరింత ఉధృతమైంది. కేసీఆర్‌ ఆమరణ దీక్షతో రాష్ట్ర విభజన సాధించాడు. దీంతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి ప్రజాస్వామ్య పాలన మెరుగుపరుచడంతో హైదరాబాద్‌ వంటి నగరాల్లో స్ధిరత్వం కొనసాగింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీఆర్‌ఎస్‌కు ప్రజలకు మద్దతు లభించింది.

కాంగ్రెస్‌ వ్యూహాత్మక ప్రణాళిక..
కాంటోన్మెంట్, జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయాలు సాధించినప్పటికీ, పల్లె ప్రాంతాల్లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై చర్చ జరుగుతోంది. పంచాయతీ ఎన్నికల వేళ.. ఇది మరింత ఎక్కువైంది. రైతుబంధు వాయిదా పడటం, హామీల అమలు కాకపోవడంతో ప్రజలు నిలదీస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ వాదంతో అస్థిరత సృÙ్టంచడం కాంగ్రెస్‌ వ్యూహంగా కనిపిస్తోంది.

పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై రాజకీయం..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఇటీవల తెలంగాణ దిష్టి తగలడంతో కోనసీమ పచ్చదనం కోల్పోతోందని పేర్కొన్నారు. దీనిపై కాంగ్రెస్‌ ఆలస్యంగా స్పందించింది. ఇప్పుడు దీనిపైనే రాజకీయం చేస్తోంది. తెలంగాణకు పవన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తోంది. లేదంటే సినిమాలు ఆడనివ్వమని మంత్రి కోమటిరెడ్డి స్వయంగా హెచ్చరించారు. బీఆర్‌ఎస్‌ కూడా పవన్‌ వ్యాఖ్యలను ఖండిచింది. కానీ కాంగ్రెస్‌ దీనిని రాజకీయం చేస్తోంది. తెలంగాణ–ఆంధ్ర కేఫ్‌ సెంటిమెంట్‌ వేడెక్కించడంతో, రాజకీయ వాతావరణంలో మరింత ఉద్రిక్తత ఏర్పడుతోంది.

తాజా పరిణామాలతో రెండు రాష్ట్రాల మధ్య శాంతి, అభివృద్ధి వాతావరణంలో ఉద్రిక్తతలకు దారితీయొచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాజకీయాలకన్నా స్థిరత్వం అవసరమని పేర్కొంటున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version