Shankar and Rajamouli : సినిమా ఇండస్ట్రీ అనేది టాలెంట్ ఉన్నోళ్లకు అవకాశాలను అందిస్తూ స్టార్ డమ్ ను సంపాదించి పెట్టడంలో చాలా వరకు కృషి చేస్తుంది. ఇక ఇప్పటివరకు ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళను వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగిన వాళ్లే కావడం విశేషం… ఇక ఎప్పుడైతే ఒక దర్శకుడు గాని, హీరో గాని వాళ్ళు చేసిన సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధిస్తారో అప్పుడే వాళ్ళు స్టార్లుగా వెలుగొందుతారు…
సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఇంతకు ముందు చాలా మంచి సినిమాలు వచ్చాయి. అలాగే ప్రేక్షకులను అలరిస్తూ ఎంటర్ టైన్ చేయడమే కాకుండా తమదైన రీతిలో ఆ సినిమాలు సత్తా చాటుకున్నాయి. అలాంటి మన సినిమాలని బాలీవుడ్ దర్శకులు గాని, హీరోలుగాని అసలు పట్టించుకునేవారు కాదు. కేవలం సౌత్ సినిమాలంటే లాజిక్స్ ను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా సినిమాలను తీస్తూ ఆరు పాటలు, నాలుగు ఫైట్లతో మూడు కుళ్ళు జోకులతో సినిమాని ముందుకు లాగించేస్తారనే ఒక అభిప్రాయంలో అయితే వాళ్ళు ఉండేవారు. దానివల్ల సౌత్ సినిమా పేరు చెప్తేనే బాలీవుడ్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించజ పోగా మనవాళ్ళ మీద కామెడీ చేస్తు నవ్వుకునేవారు. ఇక దానికి తగ్గట్టుగానే మన సౌత్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు బాలీవుడ్ లో సక్సెస్ అయిన సినిమాలను తెలుగులో తీసి సక్సెస్ లను సాధిస్తూ ఉండేవారు. దానివల్ల వాళ్లకి వాళ్ల సినిమాల మీద వాళ్ళ కథల మీద చాలా కాన్ఫిడెంట్ అయితే ఉండేది. ఇక దానివల్లే మన దర్శకులు బాలీవుడ్ హీరోలతో సినిమాలు చేయాలని ప్రణాళికలు రూపొందించుకుంటున్న సమయంలో అక్కడి హీరోలు మాత్రం మన వాళ్ళతో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. ఇక అందులో భాగంగానే శంకర్ రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకులను సైతం వాళ్లు రిజెక్ట్ చేశారు. ఇక ఇదిలా ఉంటే వాళ్ల డిమాండ్ అప్పుడు అంతలా ఉండేది.
ఇక శంకర్ తన రోబో సినిమాని మొదటి షారుక్ ఖాన్ తో చేయాలని అతనికి కథ వినిపించాడు. అయినప్పటికి శంకర్ మీద నాకు నమ్మకం లేదు అంటూ షారుక్ ఖాన్ ఆ కథను రిజెక్ట్ చేశారట. రాజమౌళి లాంటి దర్శకుడు కూడా బాహుబలికి ముందు కొద్ది సార్లు బాలీవుడ్ సినిమా చేయాలని ప్రణాళికలు రూపొందించాడు.
అయినప్పటికి వాళ్లకు రాజమౌళి మీద అంత పెద్ద నమ్మకం లేకపోవడంతో సౌత్ డైరెక్టర్ అని ఒక చిన్న చూపు చూసి అతన్ని రిజెక్ట్ చేశారు. ఇక కట్ చేస్తే రాజమౌళి బాహుబలి తో పెను ప్రభంజనాన్ని సృష్టించాడు. ఇక ఇప్పుడు రాజమౌళితో ఒక సినిమా చేయడానికి వాళ్లు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.
ఇక సినిమా చేయడం వీలు కాకపోతే ఆయన చేస్తున్న సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చిన చేస్తామంటూ వాళ్ళు ఆసక్తిని చూపించడం ఇప్పుడు యావత్ ఇండియన్ ప్రేక్షకులందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది… ఇక ఏది ఏమైనా కూడా బాలీవుడ్ హీరోల్లో ఇంతకు ముందు ఉన్న పొగరైతే ఇప్పుడు లేదనే చెప్పాలి…