Bigg Boss Telugu 8: మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్ 8 షో ముగియబోతుంది. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్స్ మధ్య సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ ఈ వారం మాత్రం ఆడియన్స్ కి తెగ బోర్ కొట్టించేస్తుంది. కంటెస్టెంట్స్ కి సంబంధించిన స్పెషల్ AV వీడియోస్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే, బిగ్ బాస్ టీం మాత్రం కేవలం సీరియల్స్ ప్రమోషన్స్ చేసుకోవడానికి స్టార్ మా పరివారం టీం కి అవకాశం ఇచ్చింది. గత మూడు రోజుల నుండి నాన్ స్టాప్ గా వాళ్ళే వచ్చి వెళ్తున్నారు. ఇదంతా పక్కన పెడితే లేటెస్ట్ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న ఒక వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా టాప్ 5 కంటెస్టెంట్స్ కి ఫినాలే ఎపిసోడ్ కి ముందు ఒక ముఖ్య అతిథి కి ఒక సూట్ కేసు ని ఇచ్చి బిగ్ బాస్ హౌస్ లోకి పంపబోతున్నారట.
ఆ సూట్ కేసు లో పది లక్షల రూపాయిలు ఉంటుందట. ఈ ఆఫర్ ని అవినాష్ ఒప్పుకోవాల్సిందిగా బిగ్ బాస్ టీం పరోక్షంగా అతనికి హింట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అవినాష్ కి తాను ఎలాగో టైటిల్ గెలవడు అనే విషయం అతనికి స్పష్టంగా తెలుసు. కాబట్టి ఈ పది లక్షల రూపాయిలను ఆయన తీసుకొని బయటకి వచ్చేందుకు సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ కి సంబంధించిన AV వీడియోలు మొత్తం టెలికాస్ట్ చేసిన ఈ తర్వాత ఈ ఎపిసోడ్ ఉండబోతుందని తెలుస్తుంది. బహుశా శుక్రవారం, లేదా శనివారం ఎపిసోడ్ లో ఇది జరగొచ్చు. అవినాష్ గత వీకెండ్ ఎపిసోడ్ లో గెలిచిన ప్రైజ్ మనీ తో ఏమి చేస్తావని నాగార్జున అడగగా, ఆయన తన అన్నయ్య పెద్ద కూతురు వివాహానికి అవసరమయ్యే డబ్బులు ఇస్తానని చాలా నిజాయితిగా చెప్పుకొచ్చాడు.
ఇప్పుడు ఆయన ఈ పది లక్షలు తీసుకొని రావడంలో ఎలాంటి తప్పు లేదని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే డిజాస్టర్ అవ్వాల్సిన ఈ సీజన్ ని అవినాష్ తన అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ తో హిట్ దిశగా అడుగులు వేసేలా చేసాడు. షో సక్సెస్ బాధ్యతని తన భుజాల మీద వేసుకొని నడిపించాడు అనడంలో ఎలాంటి అతిసయోక్తి లేదు. ముఖ్యంగా ఈ వారం అవినాష్ లేకపోయుంటే టీఆర్ఫీ రేటింగ్స్ డిజాస్టర్ కా బాప్ రేంజ్ లో వచ్చేవి. షో కి ఇంత లాభం చేకూర్చిన అవినాష్ కి 10 లక్షల రూపాయిలు ఇవ్వడం చాలా తక్కువని నెటిజెన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ అతని కష్టాన్ని గుర్తించి ఇంత మంచి ఆఫర్ ఇవ్వడం పై బిగ్ బాస్ టీం ని అభినందిస్తున్నారు. ఈ సీజన్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా అవినాష్ కి మరికొన్ని క్రేజీ షోస్ ని ఇచ్చారట స్టార్ మా టీం.