Anasuya Bharadwaj: సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం యాంకర్లదే హవా నడుస్తోంది. సినిమా హీరోయిన్ల రేంజ్ లో వీరి పర్ఫామెన్స్ ఉండడంతో వీరికి ఫ్యాన్స్ రోజురోజుకు పెరిగిపోతున్నారు. యాంకర్లుగా గుర్తింపు వచ్చాక సినిమాల్లో అవకాశాలు రావడం ఈజీ అవుతోంది. దీంతో ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చేవారు యాంకర్ కావాలని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు టీవీల్లో తమ అందచందాలతో యాంకరింగ్ చేసిన చాలా మంది ఇప్పుడు సినిమాల్లో కొనసాగుతున్నారు. కొందరు స్టార్లుగా మారి హీరోయిన్లను డామినేట్ చేస్తున్నారు. వీరిలో ఓ భామ అలాగే స్టార్ డం తెచ్చుకుందని చెప్పొచ్చు. అయితే ఆమె ఇప్పుడు సినిమాలతో బిజీగా మారింది. కానీ సినిమాల్లో తక్కువ.. సోషల్ మీడియాలో ఎక్కువ.. అన్నట్లుగా ఉంటారు. నిత్యం నెట్టింట్లో తన ట్వీట్లతో దుమారం లేపుతున్న ఆమె చిన్న నాటి ఫొటో ఒకటి వైరల్ అవుతోంది. ఇంతకీ ఎవరు ఆమె అని తెలుసుకోవాలని ఉందా?
జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. ఇందులో చేసిన యాంకర్లు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. వారిలో యాంకర్ అనసూయ ఒకరు. తన కవ్వింపు మాటలతో ఆకట్టుకున్న అనసూయ అందచందాలను ఆరబోసి యూత్ ను ఆకట్టుకునేవారు. దీంతో ఆమె టీవీల్లో ఉండగానే పాపులర్ అయ్యారు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నా హీరోయిన్ రేంజ్ లో అందాలను ఆరబోశారు. అందంతోనే కాకుండా యాక్టింగ్ లోనూ మంచి టాలెంటెడ్ అని గుర్తించిన కొందరు డైరెక్టర్లు ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం తీరిక లేకుండా సినిమాలతో బిజీగా మారింది అనసూయ.
1979 జన్మించిన అనసూయ మొదట్లో న్యూస్ రీడర్ గా పనిచేశారు. ఆ తరువాత జబర్దస్త్ ప్రొగ్రామ్ లో యాంకర్ గా అవకాశం వచ్చింది. ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాగ’ సినిమాలో అనసూయను చూడొచ్చు. అయితే ఈ సినిమా సక్సెస్ కాకపోవడంతో అమెకు అవకాశాలు రాలేదు. అయితే జబర్దస్త్ లో యాంకర్ గా కొనసాగింది. ప్రొగ్రాం సక్సెస్ కావడంతో ఆమెకూ గుర్తింపు వచ్చింది. ఆ తరువాత అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో నటించే చాన్స్ వచ్చింది. ఆ తరువాత క్షణం అనే సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్ర రావడంతో అప్పటి నుంచి అనసూయ కెరీర్ మలుపు తిరిగింది.
ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు అనసూయ. తన పర్సనల్ ఫొటోలను ఫ్యాన్స్ కు పరిచయం చేస్తూ వారితో చిట్ చాట్ చేస్తారు. ఇటీవల అనసూయ చేసిన ఓ ట్వీట్ దుమారం లేపింది. రౌడీ స్టార విజయ్ దేవరకొండపై ఆమె చేసిన ఓ మెసేజ్ తో ఆయన ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఆ తరువాత మళ్లీ వారికి సెటైరికల్ రిప్లై ఇవ్వడంతో మరింత చర్చనీయాంశంగా మారింది. దీంతో అనసూయ గురించి సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెట్టి నెటిజన్లు హల్ చల్ చేస్తుంటారు.
లేటేస్టుగా అనసూయ గురించి మరోసారి చర్చ మొదలైంది. ఆమె చిన్నప్పటి ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పుడెలా ఉన్నారో చిన్నప్పుడు కూడా అలాగే ఉండడంతో అందం అప్పటికీ, ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదు.. అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ పుష్ప2, విమానం అనే సినిమాలతో బిజీగా మారింది. త్వరలో విమానం సినిమా రిలీజ్ కాబోతుంది. ఏదీ ఏమైనా యాంకర్లలో మిగతా వారికంటే అసనూయ స్పెషల్ అని కొందరు కొనియాడుతూ ఉంటారు.