https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : మొదటి రోజే టాస్కులో సత్తా చాటిన ‘గంగవ్వ’..కుర్రోళ్లను కూడా డామినేట్ చేసేసిందిగా..అదేమీ స్పీడ్ సామీ!

కెరీర్ బిందాస్ గా సాగదీస్తున్న గంగవ్వ ఇప్పుడు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టింది. ఇంత వయస్సులో ఈమెను తీసుకొని రావడం అవసరమా, అసలు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, టాస్కులు అన్నారు, ఫిజికల్ టాస్కులు వచ్చినప్పుడు ఈమె హౌస్ లో కుర్రవాళ్ళతో సమానంగా ఆడలేదు. ఏదైనా తేడా జరిగితే ఆమెకు ఆరోగ్య పరంగా కూడా తీవ్రమైన రిస్థితులు ఎదురు అవుతాయి అని అందరూ అనుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 7, 2024 / 08:20 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ రియాలిటీ షో చరిత్రలో మొట్టమొదటిసారి 60 ఏళ్ళు పైబడిన ముసలావిడని కంటెస్టెంట్ గా హౌస్ లోకి తీసుకొచ్చి చరిత్ర సృష్టించాడు బిగ్ బాస్. సీజన్ 4 లో ‘గంగవ్వ’ ద్వారా ఈ అరుదైన సంఘటన జరిగింది. అప్పట్లో గంగవ్వ తన పరిధిమేర బాగానే ఆడింది, నామినేషన్స్ లోకి వచ్చినప్పుడల్లా అందరి కంటే టాప్ ఓటింగ్ తో ఉండేది, కానీ నాలుగు వారాల తర్వాత ఆమెకు బిగ్ బాస్ వాతావరణం పడకపోవడంతో కెమెరాల ముందుకు వచ్చి నేను వెళ్ళిపోతాను నన్ను పంపేయండి అంటూ బ్రతిమిలాడింది. దీంతో నాగార్జున ఆమెని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి కాసేపు మాట్లాడి ఆమెను షోలో కొనాగేందుకు ఒప్పించే ప్రయత్నం చేసాడు. కానీ గంగవ్వ నా వల్ల అవ్వట్లేదు సారూ అని ఇచ్చేస్తుంది. దీంతో నాగార్జున ఆమెని ఎలిమినేట్ చేసి బయటకి పంపిస్తాడు.

    పంపే ముందు ఆమె జీవిత కలగా మిగిలిపోయిన సొంత ఇల్లు నిర్మాణం కి అయ్యే ఖర్చుని నాగార్జున సహాయ సహకారాలతో నిర్మించుకుంది. అలాగే తన అప్పులను మొత్తం తీర్చేసుకుంది. బిగ్ బాస్ సీజన్ 4 లో ఆమెకు అవకాశం రావడానికి ప్రధాన కారణం యూట్యూబ్ లో బాగా ఫేమస్ అవ్వడం వల్లే. యూట్యూబ్ లో ఈమె అప్పట్లో ‘మై విలేజ్’ అనే పాపులర్ షో నడిపేది. ఇందులో ఆమె యాస, కామెడీ టైమింగ్ తో అశేష ప్రేక్షకాభిమానం ని సంపాదించుకుంది. ఆ ఫేమ్ తోనే బిగ్ బాస్ షో లో అవకాశం సంపాదించిన ఈమె, షో నుండి బయటకి వచ్చిన తర్వాత ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో ముఖ్య పాత్రలు పోషించింది. కొత్త సినిమా విడుదల సమయం లో ప్రొమోషన్స్ కోసం నటీనటులు ఈమె యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూస్ కూడా చేయించుకునేవారు. వారిలో ప్రముఖ స్టార్ హీరోలు నాగార్జున, విజయ్ దేవర కొండా వంటి వారు కూడా ఉన్నారు.

    అలా కెరీర్ బిందాస్ గా సాగదీస్తున్న గంగవ్వ ఇప్పుడు హౌస్ లోకి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అడుగుపెట్టింది. ఇంత వయస్సులో ఈమెను తీసుకొని రావడం అవసరమా, అసలు అన్ లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్, టాస్కులు అన్నారు, ఫిజికల్ టాస్కులు వచ్చినప్పుడు ఈమె హౌస్ లో కుర్రవాళ్ళతో సమానంగా ఆడలేదు. ఏదైనా తేడా జరిగితే ఆమెకు ఆరోగ్య పరంగా కూడా తీవ్రమైన రిస్థితులు ఎదురు అవుతాయి అని అందరూ అనుకున్నారు. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన వెంటనే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుని అద్భుతంగా ఆడి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది గంగవ్వ. ఈమెతో పోటీగా విష్ణు ప్రియ, సీత వచ్చి గేమ్ ఆడి ఓడిపోతారు. చూస్తుంటే గంగవ్వ ఈ సీజన్ లో టాస్కులు కుర్ర కంటెస్టెంట్స్ తో సమానంగా రఫ్ఫాడించేలా ఉంది. చూడాలి మరి ఈ సీజన్ లో అయినా ఆమె చివరికి వరుకు ఉంటుందా, లేదా కొన్ని వారాలు ఉండి ఎలిమినేట్ అవుతుందా అనేది. ఈ వారం నామినేషన్స్ లోకి కూడా గంగవ్వ వచ్చింది.