Homeజాతీయ వార్తలుNarendra Modi AI speech : ఏఐకి మూలం అమెరికా కావచ్చు.. శక్తి మాత్రం ఇండియాదే.....

Narendra Modi AI speech : ఏఐకి మూలం అమెరికా కావచ్చు.. శక్తి మాత్రం ఇండియాదే.. నరేంద్ర మోడీ చెప్పిన ఆ సీక్రెట్ ఏంటంటే?

Narendra Modi AI speech : టెక్నాలజీలో అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చుట్టూ తిరుగుతోంది. అనేక రంగాలను అది తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. తద్వారా ఎంతో కఠినమైన పనులు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సాగిపోతున్నాయి.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం టెక్నాలజీ మాత్రమే కాదని.. అదే అనేక రకాల మార్పులకు నాంది పలికే అస్త్రం అని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా స్పష్టం చేశారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంఫాక్ట్ సమ్మిట్ 2026 సదస్సుకు ప్రపంచ దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. సుమారు వందకు పైగా దేశాల నుంచి వచ్చిన నాయకులను, టెక్నాలజీ నిపుణులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రసంగించారు. ఏఐ డెవలప్మెంట్లో తమ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల గురించి వెల్లడించారు. ఇదే క్రమంలో నరేంద్ర మోడీ MANAV అనే పదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆ పదానికి ఇచ్చే నిర్వచనాన్ని కూడా ఆయన బలంగా చెప్పారు.

M అనే అక్షరానికి మోరల్ అండ్ ఎథికల్..

A అనే అక్షరానికి అకౌంటబుల్ గవర్నెన్స్

N అనే అక్షరానికి నేషనల్ సావరిజంటి

A అనే అక్షరానికి యాక్సిసబుల్ టెక్నాలజీ

V అనే అక్షరానికి వ్యాలిడేటెడ్ సిస్టమ్స్..

అనే అర్థాలను చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. గతంలో వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రపంచ వ్యాప్తంగా మొదలైనప్పుడు.. సాంకేతిక పరిజ్ఞానం ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతుందని ఎవరూ అంచనా వేయలేకపోయారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా అదే స్థాయిలో డెవలప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా యంత్రాలు అనేవి చాలా షార్ప్ అవుతున్నాయి. ఇదే సమయంలో మనుషుల సామర్థ్యాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ సాంకేతిక విప్లవంలో మనుషులు కేవలం సమాచార కేంద్రాలుగా మిగిలిపోతే పెద్దగా ప్రయోజనం ఉండదు. మనుషులు సాధికారతను సాధిస్తూ.. టెక్నాలజీ పై పట్టును సాధించాల్సిన అవసరం ఉంది.

మనదేశంలో అతిపెద్ద యువ జనాభా ఉంది. అత్యధికంగా సాంకేతిక పరిజ్ఞానం మీద ప్రతిభ ఉన్న యువకులు ఉన్నారు. వీరంతా ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్స్ కు బలమైన కేంద్రంగా నిలుస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రజల సంక్షేమానికి.. శ్రేయస్సుకు అడుగులు వేస్తే అంతకు మించిన పురోగతి మరొకటి ఉండదు. సరిగ్గా ఇవే విషయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏఐ సమ్మిట్ లో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 కంటే ఎక్కువ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ నుంచి బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డసిల్వ వరకు పాల్గొన్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version