Homeఎంటర్టైన్మెంట్Toxic Movie: 'టాక్సిక్' చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా..? పెద్ద పొరపాటు...

Toxic Movie: ‘టాక్సిక్’ చిత్రాన్ని మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా..? పెద్ద పొరపాటు చేశాడుగా!

Toxic Movie: KGF సిరీస్ తర్వాత కన్నడ సూపర్ స్టార్ యాష్(Rocking Star Yash) హీరో గా నటించిన ‘టాక్సిక్'(Toxic Movie) చిత్రం వచ్చే నెల 19 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా పై అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఒకే ఒక్క గ్లింప్స్ వీడియో తో యాష్ అల్లకల్లోలం సృష్టించేశాడు. ఆ గ్లింప్స్ కారణంగా తెలుగు లో కూడా ఈ చిత్రానికి మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ గ్లింప్స్ వీడియో కి యూట్యూబ్ లో దాదాపుగా 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు, ఈ సినిమాపై యూత్ ఆడియన్స్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది. ఈ చిత్రం విడుదలయ్యే రోజునే ‘ధురంధర్ 2’ కూడా విడుదల అవ్వబోతుందని నిన్న మొన్నటి వరకు వినిపించిన మాట. కానీ ఈ సినిమా షూటింగ్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఒకవేళ అదే కనుక జరిగితే ‘టాక్సిక్’ చిత్రం తో యాష్ పాన్ ఇండియా లెవెల్ లో వీర విహారం చేస్తాడని చెప్పొచ్చు. అవలీల గా వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత సత్తా ఉన్న చిత్రమిది. గీతూ మోహన్ దాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. KVN ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ ని దిల్ రాజు భారీ రేట్ కి సొంతం చేసుకున్నాడని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ సీఎంకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ సబ్జెక్టు ని ముందుగా మన తెలుగు హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కి వినిపించింది అట డైరెక్టర్ గీతూ మోహన్ దాస్. అయితే సినిమాలో వయొలెన్స్ శాతం చాలా ఎక్కువ ఉండడం, బోల్డ్ సన్నివేశాల మోతాదు కూడా ఎక్కువ ఉండడం తో రామ్ చరణ్ వెనకడుగు వేశాడట.

గ్లింప్స్ వీడియో ని చూసిన తర్వాత రామ్ చరణ్ ఈ చిత్రం చేయకపోవడమే మంచిది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అంతటి బోల్డ్ సన్నివేశాల్లో రామ్ చరణ్ నటిస్తే మన టాలీవుడ్ ఆడియన్స్ తీసుకోలేరని, వాళ్ళని పక్కన పెట్టి గుడ్డిగా పాన్ ఇండియన్ ఆడియన్స్ కోసం సినిమా తీసే రకం రామ్ చరణ్ కాదని, ఒకవేళ చేస్తే వేరే లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అయితే ఈ చిత్రం రామ్ చరణ్ వదిలేసి తప్పు చేశాడా? , లేదా మంచి పని చేశాడా అనేది తెలియాలంటే వచ్చే నెల 19 వరకు ఆగాల్సిందే. ఇకపోతే రేపు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version