https://oktelugu.com/

Bigg Boss 8 Telugu : ‘బిగ్ బాస్ 7’ ఫేమ్ తో 15 రెస్టారెంట్స్ ప్రారంభించాడు.. ఇప్పుడు ‘బిగ్ బాస్ 8’ కోసం టేస్టీ తేజా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా!

అతని యూట్యూబ్ ఛానల్ కి రీచ్ పదింతలు పెరిగింది. పెద్ద హీరోలు సైతం తమ సినిమాలకు ప్రొమోషన్స్ కోసం టేస్టీ తేజా ని ఉపయోగించుకునేవారు. అలా బయటకి వచ్చిన తర్వాత లక్షలు సంపాదించాడు.

Written By:
  • NARESH
  • , Updated On : October 7, 2024 / 08:15 AM IST

    Bigg Boss 8 Telugu testy teja

    Follow us on

    Bigg Boss 8 Telugu : నిన్న బిగ్ బాస్ సీజన్ 8 ‘రీ లోడ్’ ఎపిసోడ్ ద్వారా హౌస్ లోకి పాత సీజన్స్ కి సంబంధించిన కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డు ఎంట్రీలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నిన్నటి ఎపిసోడ్, గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ కంటే అద్భుతంగా ఉంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ సీజన్ లో 2వ వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్ టేస్టీ తేజా. ఈయన సీజన్ 7 లో అందించిన ఎంటర్టైన్మెంట్ మామూలుది కాదు. టాస్కులు పెద్దగా ఆడకపోయినా కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లోనే షో లో 8 వారాలు కొనసాగాడు. కానీ అతని దురదృష్టం కారణంగా ఫ్యామిలీ వీక్ కి ముందు వారం ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. తన తల్లిని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు చూపించే అవకాశం పోయిందని టేస్టీ తేజా అప్పట్లో బాగా ఫీల్ అయ్యాడు.

    అయితే బిగ్ బాస్ రియాలిటీ షో తేజా జీవితాన్ని మార్చేసింది అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. అప్పటి వరకు ఒక యూట్యూబర్ కేవలం సోషల్ మీడియా ఆడియన్స్ కి మాత్రమే పరిచయం ఉన్న టేస్టీ తేజా, ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యాడు. దీంతో షో నుండి బయటకి వెళ్లిన తర్వాత మనోడికి వచ్చిన ఫ్యాన్ ఫాలోయింగ్ ని చూసి ఆశ్చర్యపోయాడు. అతని యూట్యూబ్ ఛానల్ కి రీచ్ పదింతలు పెరిగింది. పెద్ద హీరోలు సైతం తమ సినిమాలకు ప్రొమోషన్స్ కోసం టేస్టీ తేజా ని ఉపయోగించుకునేవారు. అలా బయటకి వచ్చిన తర్వాత లక్షలు సంపాదించాడు.

    ఒకప్పుడు రెస్టారెంట్స్ కి వెళ్లి ఫుడ్ వీడియోలు చేసుకునే టేస్టీ తేజా, 15 కొత్త రెస్టారెంట్స్ ని ఓపెనింగ్స్ కి ముఖ్య అతిథిగా వెళ్లి రిబ్బన్స్ కత్తిరించే స్థాయికి వెళ్ళాడు. అంతే కాదు తన సొంత కష్టం తో సంపాదించిన డబ్బులతో తేజా ఒక టీ షాప్ ని ప్రారంభించాడు. అది గ్రాండ్ సక్సెస్ అవ్వడంతో ఏకంగా 20 బ్రాంచులను ప్రారంభించి బిజినెస్ మ్యాన్ గా ఎదిగాడు. స్టార్ మా, ఈటీవీ వంటి చానెల్స్ లో ఈయన పలు ఎంటర్టైన్మెంట్ షోస్ లో కూడా పాల్గొనే వాడు. ఈ బిగ్ బాస్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు ఆయన స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన సూపర్ హిట్ ఎంటర్టైన్మెంట్ షో ‘కిరాక్ బాయ్స్..కిలాడి లేడీస్’ లో కూడా ఒక కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు. అలా మంచి క్రేజ్ ని సంపాదించిన టేస్టీ తేజా ఇప్పుడు సీజన్ 8 లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈసారి ఎంటర్టైన్మెంట్ తో పాటు, గేమ్స్ కూడా అదరగొడుతాను అని చెప్పి లోపలకు వెళ్లిన ఈయన ఎలా ఆడుతాడో చూడాలి. ఈ సీజన్ లో పాల్గొనేందుకు టేస్టీ తేజ వారానికి 4 లక్షల 50 వేల రూపాయిలు అందుకుంటున్నట్టు తెలుస్తుంది.