Mahesh Babu Next Movie 2026: కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు…కెరియర్ స్టార్టింగ్ లో సక్సెస్ కోసం చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికి ఆ తర్వాత వచ్చిన సక్సెస్ లతో స్టార్ హీరో గా మారిపోయాడు. ప్రస్తుతం పాన్ వరల్డ్ లో సినిమా చేస్తున్నాడు. రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించే ప్రయత్నంలో ఉన్నాడు… ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ఎవరి డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద ఇప్పటివరకు సరైన క్లారిటీ అయితే రావడం లేదు. మహేష్ బాబు నెక్స్ట్ సినిమా మీద రోజుకొక వార్త అయితే వినిపిస్తుంది. కానీ రీసెంట్ గా నమ్రత ఈ విషయం మీద స్పందించింది. మొత్తానికైతే మహేష్ బాబు తన నెక్స్ట్ సినిమాని సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో చేయబోతున్నాడు అంటూ తన సన్నిహితుల దగ్గర చెబుతుందట. ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న దర్శకులలో సందీప్ రెడ్డివంగ కూడా ఒకరు కావడంతో అతనితో సినిమా చేయడానికి నమ్రత గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది.
ఇంతకుముందే సందీప్ రెడ్డి వంగ మహేష్ బాబు ని కలిసి ఒక కథను కూడా వినిపించాడు. అయితే ఆ కథ చేయాల వద్ద అనే డైలమాలో ఉన్న మహేష్ బాబు ఎట్టకేలకు ఆ కథను చేద్దామని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టుగా తెలుస్తుంది…
ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా సైతం ‘స్పిరిట్’ సినిమా చేస్తున్నాడు. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే సూపర్ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నాడు… మొత్తానికైతే మహేష్ బాబుతో ఆయన చేయబోతున్న సినిమా విషయంలో చాలా క్లారిటిని మెయింటైన్ చేయబోతున్నాడట.
ఇప్పటికే నమ్రత సైతం అందులో కూడా మార్పులు చేర్పులు చెప్పినప్పటికి సందీప్ రెడ్డివంగా ఆ మార్పులను చేశారట. మొత్తానికైతే సందీప్ వంగ మహేష్ బాబు కాంబినేషన్లో సినిమా అనేది ఫిక్స్ అయిపోయింది అంటూ సినిమా ఇండస్ట్రీలో కూడా టాక్ నడుస్తుంది…