Bigg Boss 8 Telugu : గడిచిన 7 సీజన్స్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర ప్రేక్షకుల హృదయాల్లో వేసి వెళ్తారు. అలాంటి కంటెస్టెంట్స్ లో ఒకరు హరి తేజ. ఈమె సీజన్ 1 ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ మామూలుది కాదు. ముఖ్యంగా ఈమె చెప్పే హరికథలు అప్పట్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేవి. కేవలం ఎంటర్టైన్మెంట్ లో మాత్రమే కాదు, టాస్కులు మగవాళ్ళతో సమానంగా పోటీ పడి ఆడగలదు, నామినేషన్స్ సమయం లో సరైన రీజన్స్ బలంగా పెట్టడంలో ఈమె దిట్ట. ఇక గొడవలకు వస్తే ఈమె సివంగి అయిపోతుంది. అందుకే ఆ సీజన్ లో ఆమె టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిల్చింది. అప్పటి వరకు హరి తేజ అంటే పెద్దగా ఆడియన్స్ కి తెలిసేది కాదు. కానీ బిగ్ బాస్ షో తర్వాత ఆమె రేంజ్ మారిపోయింది. వరుసగా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
అవి కూడా చిన్న సినిమాలు కాదు, పెద్ద హీరోల సినిమాల్లో ప్రేక్షకులు గుర్తించుకోదగ్గ పాత్రలు చేసి మంచి నటిగా పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా విడుదలై పాన్ ఇండియా లెవెల్ లో బాక్స్ ఆఫీస్ వసూళ్లు కుమ్మేస్తున్న ‘దేవర’ చిత్రం లో కూడా ఈమె ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇలా సినిమాల్లో ఇంత బిజీ గా ఉండే హరి తేజ అకస్మాత్తుగా ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ గా అడుగుపెట్టగానే అందరూ షాక్ కి గురి అయ్యారు. మరి అంత బిజీ ఆర్టిస్టు ని బిగ్ బాస్ టీం తీసుకొచ్చారంటే రెమ్యూనరేషన్ కూడా భారీ స్థాయిలోనే ఇచ్చునంటారు అని మీ అందరికీ ఇప్పటికే అర్థం అయ్యి ఉంటుంది. అవును..అది నిజమే, ఈ సీజన్ లో పాల్గొనేందుకు ఆమెకు బిగ్ బాస్ టీం వారానికి 5 లక్షల రూపాయిలు ఇస్తున్నారట. ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ గా హౌస్ లోకి అడుగుపెట్టినప్పటికీ, మొదటి వారం నుండే లెక్కలోకి వేసి ఇస్తారట. ఇప్పటికి బిగ్ బాస్ షో పూర్తి అయ్యి 5 వారాలు అయ్యింది.
ఈ 5 వారాలకు కలిపి ఆమె 20 లక్షల రూపాయిల అడ్వాన్స్ కూడా తీసుకుందట. ఇక హౌస్ లో ఈమె ఎన్ని వారాలు కొనసాగితే, అన్ని 5 లక్షల రూపాయిలు ఆమె ఖాతాలోకి వెళ్తాయి. చూడాలి మరి ఎన్ని రోజులు ఉండబోతుందో. హౌస్ లోకి రాగానే ఆమె తన మార్కు ని చూపించే ప్రయత్నం చేసింది. అందరితో బాగా కలిసిపోయింది, యష్మీ తో భవిష్యత్తులో గొడవలు అయ్యేలా ఉందని నాగార్జున తో కూడా అంటుంది. నామినేషన్స్ లో కూడా ఆమె యష్మీ నే టార్గెట్ చేసింది. ప్రతీ చిన్న దానికి రెచ్చిపోయే కంటెస్టెంట్స్ పాత వారిలో చాలా మంది ఉన్నారు. వాళ్లంతా హరితేజ తో జాగ్రత్తగా ఉండక తప్పదు. ఎందుకంటే ఈమె ఎప్పటికి అప్పుడు ఇచ్చి పారేస్తుంది. చూడాలి మరి ఆమె ఆట ఎలా ఉండబోతుంది అనేది.