Homeఎంటర్టైన్మెంట్Akhanda: 'అఖండ' హోటల్ కు ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు !

Akhanda: ‘అఖండ’ హోటల్ కు ఫ్యాన్స్‌ ఎగబడుతున్నారు !

Akhanda: నటసింహం బాలయ్య ‘అఖండ’ సినిమా మేనియా మామూలుగా సాగడం లేదు. మొన్నటివరకు థియేటర్లలో ఫ్యాన్స్‌ ను పూనకాలు ఊగించిన బాలయ్య.. ఇప్పుడు ఓటీటీ ద్వారా కూడా ప్రతి ఇంట్లో సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అభిమానుల ఉత్సాహం తారాస్థాయికి చేరింది. ఇటీవలే తిరుపతిలో ఓ బాలయ్య అభిమాని అఖండ పేరుతో ఓ హోటల్‌ కూడా తెరిచాడు.

Akhanda
Akhanda

కాగా వంటలు కూడా రుచికరంగా ఉండడంతో బాలయ్య ఫ్యాన్స్‌ హోటల్‌ కు ఎగబడుతున్నారట. ఇదేదో బాగానే ఉందే అంటున్నారు వ్యాపారులు. ఈ మధ్య ఏపీలోని ప్రకాశం జిల్లా కూనంనేనివారి పాలెం వాసులు ఏకంగా ఊర్లోని ఖాళీ ప్రదేశంలో పెద్ద తెర, సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసి ‘అఖండ’ స్పెషల్ షో వేశారు. గ్రామస్థులంతా అక్కడికి వచ్చి సినిమా చూశారు.

Also Read:  మహేష్ పెళ్లి గురించి అడిగితే ఎందుకు సిగ్గు పడ్డాడు ?

ఆ ఫొటోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్‌ అయ్యాయి. మొత్తానికి అరవై ఏళ్ల వయసులో కూడా బాలకృష్ణ నటించిన అఖండ ఈ స్థాయిలో పెద్ద హిట్ అవ్వడం విశేషం. ముఖ్యంగా బాలయ్య తనకి మాత్రమే సాధ్యమైన డైలాగ్‌ డెలివరీ, యాక్టింగ్‌ తో రోరింగ్‌ హిట్‌ని అందించాడు. ఇక ఈ అఖండ హోటల్‌ అదిరిపోయింది అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్.

‘అఖండ’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ అంచనాలతో వచ్చి మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లను రాబట్టింది. నిజానికి ఈ సినిమా కేవలం 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయింది. ఇక అప్పటి నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడిచింది. ఏది ఏమైనా బాలయ్య తన స్టార్ డమ్ ఏమిటో మరోసారి ఘనంగా బాక్సాఫీస్ సాక్షిగా గొప్పగా చాటుకున్నాడు.

Also Read:  కేంద్రం బంపర్ ఆఫర్.. డిగ్రీ అర్హతతో నెలకు రూ.10 వేలు పొందే అవకాశం?

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version