Jatt : ఒకప్పుడు బాలీవుడ్ లో మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఒక కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకున్న హీరోలలో ఒకరు సన్నీ డియోల్(sunny deol). మన టాలీవుడ్ కి బాలయ్య బాబు ఎలాగో, బాలీవుడ్ ఆడియన్స్ కి సన్నీ డియోల్ అలా అన్నమాట. మాస్ జానర్ లో ఎన్నో సంచలనాత్మక చిత్రాలు చేసి సెన్సేషన్ సృష్టించాడు. అప్పట్లో ఆయన ఏర్పాటు చేసుకున్న మాస్ ఫ్యాన్ బేస్, ఇప్పటికీ చెక్కు చెదరకుండా అలాగే ఉంది అనడానికి నిదర్శనంగా నిల్చింది రీసెంట్ గా విడుదలైన ‘జాట్'(Jaat Movie) చిత్రం. మన టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ‘మైత్రీ మూవీ మేకర్స్’ బ్యానర్ లో విడుదలైంది. ఇదే సంస్థ నుండి ఈ చిత్రం విడుదలైన రోజున తమిళ స్టార్ హీరో అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ విడుదలైన సంగతి మన అందరికీ తెలిసిందే.
Also Read : 2 రోజుల్లో 2 లక్షల టిక్కెట్లు..ట్రేడ్ ని ఆశ్చర్యపరుస్తున్న ‘జాట్’ వసూళ్లు!
సల్మాన్ ఖాన్ ‘సికిందర్’ చిత్రంతో కుదేలు అయిపోయిన బాలీవుడ్ మార్కెట్ కి సరికొత్త ఊపిరి పోసిన చిత్రంగా ‘జాట్’ చిత్రం నిల్చింది. ముఖ్యంగా మాస్ సెంటర్స్ లో ఇప్పటికీ ఈ సినిమాకు మతి పోయే రేంజ్ గ్రాస్ వసూళ్లు వస్తున్నాయి. నిన్న అక్షయ్ కుమార్ నటించిన ‘కేసరి 2’ చిత్రం విడుదలై సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకుంది. ఆ సినిమా ప్రభావం ‘జాట్’ పై పడుతుందేంమో అని అంతా అనుకున్నారు. కానీ ఇసుమంత ప్రభావం కూడా పడలేదు. బాలీవుడ్ ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 9 వ రోజున 4 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ఇప్పటి వరకు 66 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయి. స్టడీ రన్ ఉంది కాబట్టి కచ్చితంగా ఈ సినిమా ఫుల్ రన్ లో వంద కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉన్నాయి.
ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు ఓవర్సీస్ లో మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. 9 రోజులకు గాను అక్కడ కేవలం పది కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. ఓవరాల్ గా గ్రాస్ లెక్కల్లోకి చూస్తే ఈ చిత్రానికి ఇప్పటి వరకు 85 కోట్ల రూపాయిల గ్రాస్ మాత్రమే వచ్చింది. ఇంత వసూళ్లు కేవలం సన్నీ డియోల్ మాస్ ఇమేజ్ మాత్రమే వచ్చింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరో మూడు వారాల థియేట్రికల్ రన్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ పండితులు. రీసెంట్ గానే ఈ సినిమా మేకర్స్ ‘జాట్’ కి సీక్వెల్ ని కూడా ప్రకటించారు. ఈ ఏడాది లోనే ఈ సీక్వెల్ సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
Also Read : ‘జాట్’ మొదటిరోజు వరల్డ్ వైడ్ వసూళ్లు..’సికిందర్’ నే దాటేసిందిగా!