Homeఎంటర్టైన్మెంట్'ఓ బేబీ' కాంబినేషన్ రిపీట్.. గెస్ట్‌ రోల్‌లో..

‘ఓ బేబీ’ కాంబినేషన్ రిపీట్.. గెస్ట్‌ రోల్‌లో..

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ముప్పై దాటితే అవకాశాలు తగ్గిపోతాయి. పెళ్లయితే సినీ కెరీర్ కుపుల్‌స్టాప్‌ పడినట్టే. అలా తెరమరుగైన నటీమణులు ఎంతో మంది ఉంటారు. కానీ, సమంత మాత్రం అందుకు అతీతం అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న సమంత.. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అక్కినేని కోడలుగా మారిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. […]


సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ. ముప్పై దాటితే అవకాశాలు తగ్గిపోతాయి. పెళ్లయితే సినీ కెరీర్ కుపుల్‌స్టాప్‌ పడినట్టే. అలా తెరమరుగైన నటీమణులు ఎంతో మంది ఉంటారు. కానీ, సమంత మాత్రం అందుకు అతీతం అని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందు టాలీవుడ్‌లో నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న సమంత.. అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న తర్వాత కూడా అదే జోరు కొనసాగిస్తోంది. అక్కినేని కోడలుగా మారిన తర్వాత ఆమె కెరీర్ మరింత ఊపందుకుంది. వరుస హిట్లు వచ్చిపడుతున్నాయి. అదే సమయంలో ఎన్నో ఆఫర్లు వస్తున్నా కథల ఎంపికలో వైవిధ్యం ఉండేలా చూసుకుంటున్న సమంత అందుకు తగ్గ ప్రతిఫలం అందుకుటోంది. ప్రయోగాలకూ వెనుకాడడం లేదు. రంగస్థలం, మజిలీ, యూ టర్న్ ఇలా వేటికవే డిఫరెంట్ మూవీస్ చేసిన సామ్‌… గతేడాది ‘ఓ బేబీ’తో అహో అనిపించింది. బామ్మ నుంచి 24 ఏళ్ల యువతిగా మారిన క్యారెక్టర్లో జీవించిందామె.

తన స్నేహితురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో సమంత నటన మరో స్థాయిలో ఉంది అనొచ్చు. ఇండియాతో పాటు యూఎస్‌ మార్కెట్‌లో మంచి వసూళ్లు రాబట్టిందీ ఈ చిత్రం. ప్రస్తుతం విఘ్నేశ్ శివన్‌ దర్శకత్వంలో తమిళ్‌లో ఓ సినిమా చేస్తున్న సామ్‌.. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్ సెకండ్ పార్ట్‌లోనూ నటిస్తోంది. వీటి తర్వాత ఆమె మరోసారి నందిని రెడ్డితో జోడీ కట్టనుంది. ఫిక్షనల్, ఎమోషనల్‌ ఎంటర్టైనర్గా ‘ఓ బేబీ’ని అద్భుతంగా తెరకెక్కించిన నందిని.. ఇప్పుడు సమంత కోసం మరో ప్రయోగాత్మక చిత్రానికి కథ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో మరో విశేషం కూడా ఉంది. ఓ బేబీలో గెస్ట్‌ రోల్‌ చేసిన సమంత భర్త నాగచైతన్య.. కొత్త ప్రాజెక్టులోనూ కామియో అపియరెన్స్ ఇవ్వనున్నాడట. మొత్తానికి ‘ఓ బేబీ’ కాంబినేషన్‌ రిపీట్‌ కానుందన్నమాట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper