OG VS Idli Kottu VS Kantara 2: ఒక పండుగ వచ్చిందంటే చాలు వరుసబెట్టి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉంటాయి. పండగ సీజన్ ను వాడుకోవాలని ప్రతి ఒక్క దర్శక నిర్మాత చూస్తూ ఉంటారు… ఇక ఇలాంటి క్రమంలోనే ఈ దసర సీజన్ కి మూడు సినిమాలు బరిలోకి దిగాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దసర కి వారం రోజులు ముందే తన ఓజీ సినిమాని రిలీజ్ చేశాడు. అలాగే అక్టోబర్ ఒకటోవ తేదీన అంటే దసర కి ఒక్కరోజు ముందు ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమాని రిలీజ్ చేశాడు. అక్టోబర్ రెండోవ తేదీన కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి కాంతార సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చాడు…ఇక ఈ మూడు సినిమాల్లో ఏ సినిమా భారీ సక్సెస్ ని సాధించింది. ఏ సినిమా డిజాస్టర్ గా మారింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేసిన ఓజీ సినిమా పవన్ కళ్యాణ్ లోని పూర్తి స్టామినా బయటికి తీసింది…పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎలివేషన్ సన్నివేశాలు పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారు. ముఖ్యంగా ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ తన నట విశ్వరూపాన్ని కూడా చూపించాడు. మొత్తానికైతే ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఇప్పటివరకు ఈ సినిమా 400 కోట్లకు పైన కలెక్షన్లు కొల్లగొట్టి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసిస్తుందనే చెప్పాలి…
ధనుష్ హీరోగా వచ్చిన ‘ఇడ్లీ కొట్టు’ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. ఈ సినిమాలో అంత కంటెంట్ లేదని ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కినప్పటికి ఆయన ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా డీల్ చేయలేకపోయారంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం విశేషం… ధనుష్ డైరెక్షన్ లో ఇంతకుముందు రాయన్ సినిమా వచ్చింది. ఈ సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. ఇక అదే బాటలో ఇడ్లీ కొట్టు సినిమా కూడా మరోసారి డిజాస్టర్ టాక్ ను సంపాదించుకుంది. దాంతో ఇక మీదట ధనుష్ డైరెక్షన్ చేయకపోతేనే బెటరని చాలామంది తన అభిమానులు అభిప్రాయపడుతున్నారు…
కన్నడ స్టార్ హీరో అయిన రిషబ్ శెట్టి చేసిన కాంతార 2 సినిమా విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల వర్షాన్ని కురిపిస్తూ ముందుకు దూసుకెళ్తుండడం విశేషం… ఓజీ, కాంతర 2 రెండు సినిమాలు కూడా మంచి విజయాలను అందుకోవడంతో ఈ రెండిటిలో భారీ సక్సెస్ ని సాధించే సినిమా ఏది అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇప్పటివరకైతే ఓజీ కలెక్షన్ల పరంగా పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక లాంగ్ రన్ లో ఈ రెండు సినిమాలు ఎంతటి భారీ కలెక్షన్స్ ని కొల్లగొడతాయి ఈ సినిమా భారీ సక్సెస్ గా నిలుస్తోందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే…