Tanmay Bhat Youtube Earnings: ఒకప్పుడు డబ్బులు సంపాదించాలంటే కొన్ని మార్గాలు మాత్రమే ఉండేవి. ఇప్పుడైతే సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రధాన ఆదాయ మార్గంగా అది మారిపోయింది. చాలామంది ఔత్సాహితులకు అది కామధేనువుగా రూపాంతరం చెందింది. విభిన్నమైన ఆలోచనలు ఉన్నవారు యూట్యూబ్ ను దున్నేస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా వందల కోట్లు సంపాదిస్తున్నారు. అలా మనదేశంలో యూట్యూబ్ ద్వారా వందల కోట్లు సంపాదించిన ఓ వ్యక్తి వ్యవహారం సంచలనంగా మారింది.
మనదేశంలో పేరుపొందిన యూ ట్యూబర్లు చాలామంది ఉన్నారు. ఈ జాబితాలో ఎక్కువ సంపాదించిన వ్యక్తిగా తన్మయ్ భట్ నిలిచాడు. ఇతడి ఆస్తులు ఏకంగా 665 కోట్ల వరకు ఉన్నాయి. ఇదంతా కూడా అతడు యూట్యూబ్ ద్వారా సంపాదించాడు. మిస్టర్ జార్ అనే సంస్థ రూపొందించిన నివేదిక ప్రకారం.. మనదేశంలో అత్యంత రిచెస్ట్ యూట్యూబర్ గా తన్మయ్ నిలిచాడు. ఇతడిని 50 లక్షల మంది అనుసరిస్తున్నారు. ఇతడి వీడియోలు లక్షలలో వ్యూస్ సంపాదించుకుంటాయి. ఫన్నీ అంశాల మీద ఇతడు వీడియోలు రూపొందిస్తుంటాడు. అందులో కంటెంట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అందువల్లే ఇతడికి ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుంది. ఈ జాబితాలో రెండవ స్థానంలో టెక్నికల్ గురూజీ ఉన్నాడు. ఇతడి ఆస్తుల విలువ 356 కోట్లు.. ఆ తర్వాత స్థానంలో సమయ్ రైనా ఉన్నాడు. ఇతడి ఆస్తుల విలువ 140 కోట్లు. క్యారీ మీనాటి 131 కోట్లు, బీబీకి వినెస్ 122 కోట్లు, అమిత్ బదన 80 కోట్లు, ట్రిగ్గర్ర్డ్ ఇన్ సన్ 65 కోట్లు, ధృవ్ రాటి 60 కోట్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
విభిన్న అంశాల మీద వీరంతా కూడా డిఫరెంట్ వీడియోలను రూపొందిస్తుంటారు. ఆ వీడియోలలో కంటెంట్ విభిన్నంగా ఉండడంతో చాలామంది ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ఈ వీడియోలు లక్షలలో వ్యూస్ సొంతం చేసుకుంటాయి. చివరికి పొలిటికల్ అంశాలను కూడా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అయితే యూట్యూబర్లలో అత్యధిక శాతం ఆదాయం టెక్నికల్, స్పోర్ట్స్ కంటెంట్ సృష్టికర్తలకే వస్తూ ఉండటం విశేషం. పొలిటికల్ అంశాలను చెప్పేవారికి కూడా భారీగానే ఆదాయం వస్తున్నప్పటికీ.. వీరికంటే డిఫరెంట్ అంశాలను ప్రజెంట్ చేసే వారికి మాత్రమే ఎక్కువ ఆదాయం లభిస్తోంది. యూట్యూబ్ ద్వారా సంపాదించిన డబ్బును చాలామంది వివిధ సంస్థల స్థాపన కోసం ఉపయోగిస్తున్నారు.