A Star Hero In OG Movie: కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) చేసిన ప్రతి సినిమా మంచి విజయాన్ని సాధిస్తూ ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపు సంపాదించి పెట్టాయి. మరి ఇలాంటి క్రమంలోనే ఆయన చేసిన సినిమాలు గతంలో ఫ్లాప్ అయినప్పటికి ఆయన క్రేజ్ మాత్రం అంతకంతకు పెరుగుతూ వచ్చిందే తప్ప తగ్గలేదు. ఇక ఇప్పుడు ఆయన రాజకీయంగా ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన అవకాశం దొరికిన ప్రతిసారి సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు (Hari Hara Veeramallu) సినిమా షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసిన ఆయన ఇప్పుడు ఓజీ (OG) సినిమా షూటింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఓజీ సినిమా ఇంతకుముందు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలన్నిటికంటే భిన్నంగా ఉంటుందని ఆ సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని పవన్ కళ్యాణ్ గతంలో చాలా సార్లు తెలియజేశారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట పవన్ కళ్యాణ్ సినిమాలు ఏవైనా కూడా ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఓజీ సినిమా విషయంలో సుజీత్ సైతం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా క్లారిటీగా సినిమాను తెరకెక్కించారట.
మరి సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలో ఒక చిన్న క్యామియో రోల్ లో రామ్ చరణ్ నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక రీసెంట్ గా రామ్ చరణ్ కి సంబంధించిన షూటింగ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: OG Movie : ఓజీ’ నుండి సెన్సేషనల్ అప్డేట్..వచ్చే వారం నుండి ఫ్యాన్స్ కి పండగే!
ఒకవేళ రామ్ చరణ్ (Ram Charan) కనుక ఈ సినిమాలో కనిపించినట్లయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడమే కాకుండా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇలాంటి దర్శకుడు ఇంతకుముందు చేసిన సినిమాలతో పెద్దగా సక్సెస్ అయితే సాధించలేకపోయాడు.
కాబట్టి ఈ సినిమా చేసి పాన్ ఇండియాలో తను కూడా టాలెంటెడ్ డైరెక్టర్ గా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఓజీ నుంచి వచ్చిన గ్లింప్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. అలాగే టీజర్ సైతం ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకుంది…అనుకున్న సమయానికి సినిమాను తీసుకురావడానికి సినిమా పనులను శరవేగంగా పూర్తి చేయడానికి మూవీ టీం విపరీతంగా ప్రయత్నం చేస్తున్నారు…