OG Hyderabad Multiplex Theaters: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రతిష్టాత్మక చిత్రం ‘ఓజీ'(They Call Him OG) మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అనేక ప్రాంతాల్లో మొదలయ్యాయి కానీ, కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఉదాహరణకు సీడెడ్ లో ఇప్పటికీ పూర్తి స్థాయి లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. అదే విధంగా తెలంగాణ లో రేపు రాత్రి ప్రదర్శితమయ్యే ప్రీమియర్ షోస్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఇంకా ప్రారంభం అవ్వలేదు. ఇంకా హైదరాబాద్ లో ఇప్పటికే పది కోట్ల రూపాయిల అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ అతి ముఖ్యమైన PVR , ఐనాక్స్ మరియు సినీ పోలీస్ వంటి నేషనల్ మల్టీప్లెక్స్ షోస్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు. దీంతో ఫ్యాన్స్ లో తీవ్రమైన అసహనం మొదలైంది. అసలు నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఈ చిత్రాన్ని విడుదల చేసే ఉద్దేశ్యం ఉందా లేదా అంటూ బయ్యర్స్ ని ట్యాగ్ చేసి నిలదీస్తున్నారు.
వాస్తవానికి ఈపాటికి నేషనల్ మల్టీప్లెక్స్ చైన్స్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అయిపోవాలి. కానీ ఇప్పటి వరకు అవ్వలేదు, ఇది కాస్త ఆందోళనకు గురి చేసే విషయమే. మరో సంచలనమైన వార్త ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించిన రీ రికార్డింగ్ వర్క్ ఇంకా ల్యాబ్స్ లో జరుగుతూనే ఉందట. రెండు రీల్స్ కి సంబంధించిన రీ రికార్డింగ్ బ్యాలన్స్ ఉందని, అది పూర్తి అవ్వగానే ఓవర్సీస్ కి డెలివరీ అవుతుందని అంటున్నారు. కానీ కొన్ని థియేటర్స్ కి అనుకున్న సమయానికి సినిమా కంటెంట్ చేరే అవకాశం లేకపోవడం తో షెడ్యూల్ చేసిన ప్రీమియర్ షోస్ ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితి రెండు నెలల క్రితం పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రానికి జరిగింది. మళ్లీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకే ఇలాంటి పరిస్థితి ఏర్పడడం శోచనీయం.
ఓవర్సీస్ ప్రీమియర్స్ సంగతి కాసేపు పక్కన పెడితే, కనీసం ఇండియా లో ప్రీమియర్ షోస్ అయినా సమయానికి పడుతుందా లేదా క్యాన్సిల్ అవుతాయా అనేది తెలియాల్సి ఉంది. ఇదంతా కేవలం సుజిత్ మరియు ఆయన టీం చేసిన జాప్యం వల్లే అని అనుకోవచ్చు. ఒక ప్లాన్ ప్రకారం పనులు పూర్తి చేసుకోకుండా చివరి నిమిషం వరకు పని చేయడం వల్ల కోట్ల రూపాయిల డబ్బులు పెట్టి సినిమాని కొనుగోలు చేసిన బయ్యర్లు నష్టపోవాల్సి వస్తుందని, కేవలం ఒక్క ఓవర్సీస్ నుండే ఈ చిత్రానికి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయని. ఇప్పుడు సమయానికి ప్రీమియర్ షోస్ పడకపోతే అవి మొత్తం క్యాన్సిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.