OG Advance Booking Collection: సెప్టెంబర్ 12 న విడుదలైన తేజ సజ్జ(Teja Sajja) ‘మిరాయ్'(Mirai Movie) చిత్రం ఎంతటి సంచలన బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సాధించి, వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇప్పటికీ కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లు వస్తుండడం తో మరో రెండు రోజుల్లో భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ‘ఓజీ’ చిత్రానికి కూడా నష్టం కలిగించింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మరియు నైజాం ప్రాంతాలను ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ అనేక థియేటర్స్ లో మిరాయ్ చిత్రం విజయవంతమైన రన్ ని కొనసాగిస్తూ ఉండడంతో ఆ థియేటర్స్ ని ఓజీ చిత్రానికి ఇవ్వడానికి ఈ చిత్ర బయ్యర్స్ ఆసక్తి చూపించడం లేదు. ఫలితంగా రికార్డు స్థాయి రిలీజ్ దొరుకుతుందని అనుకుంటే ‘హరి హర వీరమల్లు’ కంటే చెత్త రిలీజ్ ని సొంతం చేసుకుంది ఈ చిత్రం.
సినిమాకు సూపర్ హిట్ టాక్ వస్తే పర్లేదు, పొరపాటున ఫ్లాప్ టాక్ వస్తే మాత్రం రెండవ రోజు నుండి అత్యధిక థియేటర్స్ మళ్లీ మిరాయ్ చిత్రానికి వెళ్ళిపోతుంది. కానీ సినిమా ట్రైలర్ కి మంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ లో కచ్చితంగా ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లోనే జరుగుతున్నాయి. సినిమా విడుదలకు ఒక రోజు ముందే ప్రీమియర్ షోస్ ప్రదర్శిస్తున్నారు కాబట్టి ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి ఇప్పటి వరకు 60 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. హైదరాబాద్ మరియు ఇతర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవ్వలేదు.
నేడు రాత్రి నుండి పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు అవుతాయని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. మొదటి షో పడే ముందే వంద కోట్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుందని ఫ్యాన్స్ బలమైన నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పుష్ప 2 , #RRR కి తప్ప మరో చిత్రానికి ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ విడుదలకు ముందు రాలేదు. ఇప్పుడు ఆ స్థాయి గ్రాస్ వసూళ్లు వస్తే మాత్రం కచ్చితంగా సెన్సేషన్ అనే అనుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా కంటెంట్ ఇంకా ఓవర్సీస్ మరియు ఇతర ప్రాంతాలకు చేరుకోలేదు. ఇంతటి దరిద్రమైన పరిస్థితుల్లో కూడా ఈ రేంజ్ గ్రాస్ వచ్చిందంటే కేవలం అది పవన్ కళ్యాణ్ స్టామినా వల్లే అని చెప్పొచ్చు. ఎన్నో అంచనాలతో రేపు ప్రీమియర్ షోస్ తో విడుదల కాబోతున్న ఈ సినిమా ఫ్యాన్స్ ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.