OG Movie Advance Booking: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ఓజీ(They Call Him OG) చిత్రం పై రోజురోజుకి అంచనాలు ఏ రేంజ్ లో పెరుగుతున్నాయో మనమంతా చూస్తూనే ఉన్నాం. అసలే ఈ చిత్రం పై మొదటి నుండి భారీ అంచనాలు ఉన్నాయి, దానికి తోడు నిన్న విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. వాస్తవానికి డైరెక్టర్ సుజిత్ అభిమానుల్లో అంచనాలు కాస్త తగ్గించడానికి అన్నట్టుగా ఈ గ్లింప్స్ వీడియో ని కట్ చేయించి వదిలాడు. కానీ అభిమానులకు అది కూడా పిచ్చి గా నచ్చేసింది. ఈ రేంజ్ క్వాలిటీ సినిమా ఈమధ్య కాలం లో రాలేదని, పవన్ కళ్యాణ్ అభిమానులు జీవితాంతం గర్వంగా చెప్పుకునే సినిమాగా ఓజీ చిత్రాన్ని డైరెక్టర్ సుజిత్ తీర్చి దిద్దాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్ ఇండియా లోనే టాప్ 1 గా నిలిచే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు.
సరిగ్గా ఆరు రోజుల క్రితం అడ్వాన్స్ బుకింగ్స్ ని మొదలు పెట్టారు. ఎప్పుడో నెల రోజుల తర్వాత విడుదలయ్యే సినిమాకు అంత తొందరగా అడ్వాన్స్ బుకింగ్స్ ని ప్రారంభించినప్పటికీ టికెట్స్ హాట్ కేక్స్ లాగా అమ్ముడుపోతున్నాయి. నార్త్ అమెరికా దేశం మొత్తం కలిపి ఈ చిత్రానికి 32 వేల టిక్కెట్లు అమ్ముడుపోగా, 1 మిలియన్ కి పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఒక ఇండియన్ సినిమాకు 22 రోజులకు ముందు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ జరగడం అనేది ఈమధ్య కాలం లో ఎప్పుడూ చూడలేదు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక కసితో టికెట్స్ ని తెంచుతున్నారు. ఆయన గత చిత్రం ‘హరి హర వీరమల్లు’ ఆడియన్స్ ని తీవ్రంగా నిరాశపర్చినప్పటికీ కూడా ఆడియన్స్ ఆయన తదుపరి సినిమా కోసం ఈ స్థాయిలో ఎగబడుతున్నారంటే, ఆయన క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ని బట్టీ చూస్తే కచ్చితంగా ఈ సినిమా ప్రీమియర్ షోస్ నుండి 3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లను రాబడుతుంది. కానీ ఆల్ టైం రికార్డుని సృష్టిస్తుందా లేదా అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు ప్రభాస్ ‘కల్కి’ చిత్రం ఖాతాలో ఉన్నది. ప్రీమియర్ షోస్ కి తెలుగు + హిందీ కలిపి ఈ చిత్రానికి 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఓజీ చిత్రం కల్కి ప్రీమియర్ షోస్ గ్రాస్ రికార్డుని బద్దలు కొడుతుందా లేదా అని బెట్టింగ్స్ వేసుకుంటున్నారు నెటిజెన్స్. కల్కి చిత్రానికి IMAX స్క్రీన్స్ ఉండడం వల్ల 4 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు అవలీలగా వచ్చాయి. కానీ ఓజీ చిత్రానికి IMAX వెర్షన్ రిలీజ్ లేదు. కాబట్టి ప్రస్తుతానికి ఆల్ టైం రికార్డు రావడం కష్టమని అంటున్నారు కానీ, ట్రైలర్ వేరే లెవెల్ లో పేలితే మాత్రం ఆల్ టైం రికార్డు ని నెలకొల్పుతుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.