Balakrishna Latest Viral Video: నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna) విషయంలో తెలుగుదేశం పార్టీ నేతలకు ప్రత్యేక గౌరవం. నందమూరి తారక రామారావు తనయుడిగా బాలకృష్ణకు ఎనలేని గౌరవం ఇస్తుంటారు టిడిపి నేతలు. ముఖ్యంగా పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ముఖ్య నేతలు తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు ఆహ్వానిస్తుంటారు. అయితే సినిమా షూటింగ్లలో బిజీగా ఉండే బాలకృష్ణ కొన్ని కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతారు. బాలకృష్ణ తీరిక తీసుకొని వివాహాలకు హాజరయ్యింది తక్కువే. పార్టీ నేతలు ఎవరైనా ఆహ్వానించినప్పుడు తనకు సినిమా షూటింగ్ ఉందని ముఖం మీద చెబుతారు. వస్తానంటే వస్తాను అంటారు. లేదంటే లేదని చెబుతారు. అయితే తాజాగా ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు నందమూరి బాలకృష్ణకు. అయితే దీనిపై బాలకృష్ణ భిన్నంగా స్పందించారు. తాను తప్పకుండా వస్తానని.. కానీ ఎలా వస్తాను తెలియదని చెప్పుకొచ్చారు. అయితే పెళ్లికి హాజరపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు.
ఘనంగా నిశ్చితార్థం..
రెండు వారాల కిందట నిమ్మల రామానాయుడు( Nirmmala Rama Naidu ) కుమార్తె వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. పాలకొల్లులోని ఓ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన వేడుకలకు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. మంత్రి నారా లోకేష్ ప్రత్యేకంగా హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రామానాయుడు కుమార్తె శ్రీజాను పవన్ అనే యువకుడు వివాహం చేసుకోనున్నాడు. సీఎం చంద్రబాబు కు ప్రత్యేకంగా ఆహ్వానించారు రామానాయుడు. కానీ మంత్రి లోకేష్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మంత్రులతోపాటు శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, శాసనమండలి చైర్మన్ మోసేన్ రాజు, కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తదితరులు హాజరయ్యారు. ఇప్పుడు వివాహ మహోత్సవ వేడుకలకు మంత్రి నిమ్మల రామానాయుడు అతిథులను ఆహ్వానిస్తున్నారు.
ప్రత్యేక ఆహ్వానం..
ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి వద్ద కలిసిన నందమూరి బాలకృష్ణకు ప్రత్యేకంగా ఆహ్వానించారు రామానాయుడు. రామానాయుడు కుమార్తెతో పాటు అల్లుడి గురించి ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు బాలకృష్ణ. తప్పకుండా వివాహానికి హాజరవుతానని.. అయితే ఎలా వస్తానో తెలియదంటూ చమత్కరించారు. కానీ తప్పకుండా వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదిస్తానని కూడా హామీ ఇచ్చారు. నిమ్మల రామానాయుడు కు తెలుగుదేశం పార్టీలో ప్రత్యేక స్థానం ఉంది. మంత్రి అయినా సామాన్య నేతగా సింపుల్ గా ఉంటారు రామానాయుడు. మరోవైపు నియోజకవర్గ ప్రజలకు కూడా చాలా అందుబాటులో ఉంటారు. అందుకే రామానాయుడు అంటే టిడిపి నాయకత్వానికి కూడా ఎంతో ఇష్టం. అటువంటి నేత ఇంట వివాహానికి నందమూరి బాలకృష్ణ ఎలా హాజరవుతారో చూడాలి.
హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ గారిని కలిసి ఈ నెల 24న పాలకొల్లులో జరగబోయే నా కుమార్తె శ్రీజ వివాహానికి మంత్రి నిమ్మల ఆహ్వానించారు. “వస్తాను.. కానీ ఎలా వస్తానో చెప్పను” అని బాలయ్య స్పందించారు. అలాగే దర్శకుడు బోయపాటి శ్రీను గారిని కూడా… pic.twitter.com/JvIz3wHIsl
— OkTelugu (@oktelugunews) September 3, 2025