Smartest property sale ever: ఇల్లు కట్టుకోవడం చాలామంది కల. కానీ ప్రస్తుత కాలంలో ఇల్లు కొనాలంటే జీవితాంతం కష్టపడాల్సిందే. పెద్ద భవనం కావాలంటే మాత్రం ఒకరి జీవితం సరిపోదు. కానీ అతి తక్కువ ధరకే ఇల్లు వస్తుందంటే ఎవరైనా విడిచిపెడతారా? ఏమాత్రం ఆలోచించకుండా కొనేస్తారు. అందులోనూ రూ.150 కే ఇల్లు వస్తుందంటే ఎవరైనా వదులుకుంటారా? వెంటనే కొనేస్తారు. అయితే కొనేవారి సంగతి బాగానే ఉంటుంది.. కానీ రూ.150 కి ఇల్లు ఎవరు అమ్ముతారు? అనే ప్రశ్న చాలా మందికి తలెత్తుతుంది. ఏ పరిస్థితుల్లో ఇంకా తక్కువ ధరకు ఇల్లు అమ్మాల్సి వచ్చింది? అన్న ఆలోచన కూడా వస్తుంది. అయితే ఓ వ్యక్తి రూ. 10 కోట్ల విలువైన ఇల్లును కేవలం రూ.150కి విక్రయిస్తున్నట్లు ప్రకటన చేశాడు. దీంతో అందరూ ఇతడిని పిచ్చోడు అన్నారు.. కానీ అందరిని పిచ్చోళ్లను చేసి రూ.50 కోట్లు ఆర్జించాడు. అదెలా సాధ్యమైందో ఈ స్టోరీ చదవండి..
Dunstan Low అనే వ్యక్తికి ఒక ఇల్లు ఉండేది. ఆర్థికంగా తీవ్రంగా నష్టం చేకూర్చడంతో ఈ ఇల్లును అతడు అమ్మాలని అనుకున్నాడు. దాదాపు రూ.10 కోట్ల ఇల్లును రూ.5 కోట్లకు విక్రయించాలని అనుకున్నాడు. కానీ ఎవరు ముందుకు రాలేదు. చివరకు రూ. కోటి రూపాయలకు విక్రయిస్తామని చెప్పినా ఎవరు ఆసక్తి చూపలేదు. అయితే ఇలాంటి పరిస్థితి ఎదురైన తర్వాత విసిగిపోయిన ఆయన చివరికి తన ఇల్లును రూ.150 కే విక్రయించాలని అనుకున్నాడు. దీంతో చాలామంది అతడిని చూసి పిచ్చోడు అని అనుకున్నారు. కానీ ఆయన ఇక్కడ ఒక సూపర్ ప్లాన్ వేశాడు.
తన ఇంటిని కొనుగోలు చేసేందుకు లాటరీ సిస్టం పెట్టాడు. ఈ లాటరీ టికెట్ ధర రూ.150. ఈ లాటరీలో విన్నర్ కు రూ. 10 కోట్ల ఇల్లును ఇస్తామని ప్రకటించాడు. దీంతో రూ.150 కే ఇల్లు వస్తుందని చాలామంది ఈ లాటరీని కొనుగోలు చేశారు. చివరికి Marie Segar అనే మహిళ లాటరీ గెల్చుకుంది. రూ. 10 కోట్ల ఇల్లును గెలుచుకుంది. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే.. లాటరీలు విక్రయించడం ద్వారా Dunstan Low కు మొత్తం రూ.50 కోట్లు వచ్చాయి. అంటే అతడు అనుకున్న దానికంటే ఐదు రెట్ల డబ్బులు పొందాడు.
Dunstan Low చేసిన చిన్న ఆలోచన అతనికి కోట్ల రూపాయల ఆదాయానికి మార్గం ఏర్పడింది ప్రతి ఒక్కరూ జీవితంలో కూడా ఆలోచించి పని చేస్తే ఇలా సక్సెస్ అవడం ఖాయమని అంటున్నారు. సాధారణ జీవితం అంటే ఆలోచింపజేసే జీవితం ఎంతో ఉన్నతంగా నిలుస్తుందని కొందరు నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీవితంలో సక్సెస్ కావాలని అనుకునేవారు తెలివైన ఆలోచనలను అలవర్చుకోవాలని అంటున్నారు. అంతేకాకుండా ఏదైనా కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా.. మంచి ఆలోచనతో ముందుకు వెళ్లాలని సలహాలు ఇస్తున్నారు.