OG Movie Special Review: కెరియర్ మొదట్లో పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును తీసుకొచ్చాయి. మొదట్లో వరుసగా 7 విజయాలను అందుకున్నాడు. ఇక ఆయన స్వీయ దర్శకత్వంలో చేసిన ‘జానీ’ సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పటినుంచి అతని ప్లాపుల పరంపర మొదలైంది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో ఒక సక్సెస్ ని కూడా సాధించలేకపోయారు… ఇండస్ట్రీలో విజయాలు వరించిన వాళ్ళు మాత్రమే నెంబర్ వన్ పొజిషన్ కి వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో ఎలాంటి చిన్న పొరపాటు జరిగిన ఆ హీరోలు పాతాళానికి పడిపోవాల్సి ఉంటుంది… సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేయడం అనేది పరుగు పందెం లాంటిది…ప్రతి ఒక్కరూ నిత్య కృషివలుడు వలె కష్టపడుతూ వాళ్లకు కావాల్సిన విజయాన్ని సంపాదించుకోవాలి. ఈ ప్రాసెస్ లో ఏమాత్రం రిలాక్స్ అయినా కూడా పక్కనున్న హీరోలు వాళ్లను బీట్ చేసి ముందుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. కాబట్టి ఇదొక వార్ జోన్…ఎప్పటికప్పుడు పోరాడుతూ విజయం సాధించిన వారు మాత్రమే ఇక్కడ ఎక్కువ రోజుల పాటు కొనసాగుతారు… ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఎన్ని ఫ్లాపులు వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డాడు, అంధకారంలో చిన్న వెలుగు కోసం పోరాటం చేస్తూ గడ్డు పరిస్థితిని సైతం గడ్డి పోచలా తీసిపారేసిన వైనం ప్రతి ఒక్కరికి స్పూర్తినిస్తోంది …ఇక ఈరోజు ఓజీ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడమే కాకుండా కలెక్షన్లు సునామీని సృష్టిస్తున్నాయి. థియేటర్ మొత్తం రక్తంతో ఎరుపెక్కిపోయింది.
Also Read: ‘ఓజీ’ మూవీ కి సెన్సేషనల్ ఓపెనింగ్స్..మొదటి రోజు వసూళ్లు ఎంత రావొచ్చంటే!
ప్రతి ప్రేక్షకుడి కండ్లల్లో రౌద్రం కనిపిస్తోంది. ప్రతి సీన్ కి రోమాలు నిక్కపొడుచుకొని ఇదిరా పవన్ కళ్యాణ్ సినిమా అనేంత గా ఈ సినిమాను మలిచారు. ఇలాంటి ఒక గొప్ప సినిమాతో పవన్ మన ముందుకి రావడం అనేది నిజంగా చాలా మంచి విషయం… సినిమా అంతా హైలైట్ గా ఉండటమే కాకుండా మొదటి షో తోనే సక్సెస్ ఫుల్ టాక్ తెచ్చుకుంది. నిజానికి ఈ విషయంలో మాత్రం దర్శకుడు కొంతవరకు కేర్ తీసుకుని ఉంటే బాగుండేది అనే ఫీల్ ప్రతి ఒక్కరికి కలుగుతుంది.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చిన్నప్పటి ఎపిసోడ్లను కూడా చూపిస్తారు.ఈ సీన్స్ లో ‘ అఖిరా నందన్’ ను వాడుకుంటే అయిపోయేది. లేదంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతంలో ఉన్నప్పుడు కొంతమందికి మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ ఇస్తాడు. అలాంటి సందర్భంలో పవన్ ప్రియ శిష్యుడిగా అఖిరా నందన్ ను పెడితే బాగుండేది. ఇక క్లైమాక్స్లో పవన్ తో పాటు అఖిరా వచ్చి ఫైట్ చేస్తుంటే ప్రేక్షకులకు చూడటానికి కన్నుల పండుగగా ఉండేది.
అలాగే సీక్వెల్లో అఖిరా నందన్ కీలకపాత్ర పోషించబోతున్నాడంటూ హైలెట్ చేస్తే బాగుండేది. మూవీ ఎండింగ్ లో అతని చేతిలో ఒక కత్తి పెట్టి యుద్ధానికి సిద్ధంగా ఉన్న యోధుడిగా అతన్ని ప్రమోట్ చేసుంటే సినిమా మరొక లెవల్లో ఉండేది… ఇప్పటివరకు పాన్ ఇండియాలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యేవి. ఇప్పుడు క్లైమాక్స్ చూసిన ప్రతి ప్రేక్షకుడికి ఏదో ఒక చిన్న అసంతృప్తి కలిగింది. మొత్తానికి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తోనే రన్ అవుతుండడం విశేషం…