Bigg Boss Telugu 9: బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు దూసుకుపోతోంది. అందుకు కారణం హౌస్ లో ఎదురయ్యే సంఘటనలే. ముఖ్యంగా సామాన్యులు చేసే ఓవర్ యాక్షన్, సెలబ్రిటీల అమాయకత్వమే ఈ సీజన్ ని ఇంత పెద్ద హిట్ అయ్యేలా చేసాయి. అయితే హౌస్ లోకి అగ్నిపరీక్ష కంటెస్టెంట్స్ నుండి ఇంకా కచ్చితంగా ఒకరు వైల్డ్ కార్డు గా ఎంట్రీ ఇస్తారని మనకి ముందే తెలుసు. నిన్నటి ఎపిసోడ్ లో వీళ్ళు హౌస్ లోపలకు అడుగుపెట్టారు. కాసేపటి క్రితమే ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. అనూష రత్నం, నాగ ప్రశాంత్, దివ్య నిఖిత మరియు షకీబ్ హౌస్ లోపలకు వచ్చారు. వీరిలో ఒకరిని బిగ్ బాస్ హౌస్ లోకి ఎంపిక చేసే అవకాశం హౌస్ మేట్స్ కి ఇచ్చాడు బిగ్ బాస్.
వీరిలో ఎవరు ఎంపిక అయ్యారు అనేది తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దివ్య నిఖిత హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టు సమాచారం. చాలా మంది నెటిజెన్స్ నాగప్రశాంత్ హౌస్ లోకి అడుగుపెడితే బాగుంటుందని అనుకున్నారు. ఎందుకంటే అగ్నిపరీక్ష షో ద్వారా ఇతనికి మంచి పేరొచ్చింది. ఏ కంటెస్టెంట్ కి రాని విధంగా రెండు స్టార్ లు ఇతనికి వచ్చాయి. కాబట్టి కచ్చితంగా ఇతనే హౌస్ లోకి రావాలని కోరుకున్నారు. కానీ అది జరగలేదని సమాచారం. చూడాలి మరి ఈ ప్రక్రియ ఎలా జరిగింది అనేది. ఇది ఇలా ఉండగా ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయిన ఇంటి సభ్యులు ప్రియా, పవన్ కళ్యాణ్, రీతూ చౌదరి, మాస్క్ మ్యాన్ హరీష్, ఫ్లోరా షైనీ మరియు రాము రాథోడ్.
వీరిలో ప్రియా, రీతూ చౌదరి మరియు పవన్ కళ్యాణ్ లలో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు పవన్ కళ్యాణ్, ప్రియా లలో ఒకరిని ఎలిమినేట్ చేస్తారట. ఇద్దరికీ ప్రస్తుతం తక్కువ ఓటింగ్ పడుతోంది. ప్రియా వల్ల బోలెడంత కంటెంట్ వస్తుంది కాబట్టి ఈమె సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ సేవ్ అయ్యే అవకాశాలు మాత్రం చాలా అంటే చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈయన నుండి వచ్చిన కంటెంట్ ఏమి లేదు. ఇతను ఎలిమినేట్ అయ్యాక, జర్నీ AV వీడియో చేయడానికి సరిపడా కంటెంట్ కూడా పవన్ కళ్యాణ్ నుండి రాలేదు. కాబట్టి ఈయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు 90 శాతం ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతోంది అనేది.
