OG Movie Surprise: ప్రస్తుతం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), సుజిత్(Sujeeth) కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా కోసం అభిమానులే కాదు, సాధారణ మూవీ లవర్స్ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా పై సాధారణ ప్రేక్షకుల్లో అమితాసక్తిని కలిగించిన సినిమా ఇదే. అజ్ఞాతవాసి తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలను ఎక్కువ అభిమానులే భుజాన మోసేవారు. రీమేక్స్ అవ్వడం వల్ల సాధారణ ఆడియన్స్ నుండి ఆదరణ కాస్త తక్కువ గా ఉండేది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘హరి హర వీరమల్లు’ చిత్రం అభిమానులను దారుణంగా నిరాశకు గురి చేసింది. ఇప్పుడు ఓజీ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆకలిగా ఎదురు చూస్తున్నారు. సెప్టెంబర్ 25 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Also Read: ఓటీటీ లోకి ‘మహావతార్ నరసింహా’..నిర్మాత సంచలన ప్రకటన!
రీసెంట్ గానే ఈ సినిమా నుండి ‘ఫైర్ స్ట్రోమ్’ అనే పాట విడుదలై సోషల్ మీడియా లో ప్రకంపనలు సృష్టించింది. యువత అయితే ఎక్కడ చూసినా ఈ పాటతోనే కనిపిస్తున్నారు. ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ ,ఫేస్ బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో ఎన్నో వందల ఎడిటింగ్ వీడియోస్ ఈ పాట మీద వచ్చాయి. ఇక మ్యూజిక్ ఫ్లాట్ ఫార్మ్స్ లో అయితే ఈ పాట సరికొత్త రికార్డ్స్ ని నెలకొల్పుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇలాంటి సంచలన బ్లాస్టింగ్ ప్రమోషనల్ కంటెంట్ తర్వాత మేకర్స్ మరో సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్ తో మన ముందుకు రాబోతున్నారు. ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక అద్భుతమైన యాక్షన్ టీజర్ కట్ ని సిద్ధం చేసి ఉంచారట. ఈ టీజర్ ని చూస్తే ఫ్యాన్స్ మెంటలెక్కిపోతారని అంటున్నారు. త్వరలోనే ఈ టీజర్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.
Also Read: ‘గేమ్ చేంజర్’ కి నెగిటివ్ రివ్యూ ఇచ్చినందుకు శభాష్ అని మెచ్చుకున్న స్టార్ నిర్మాత!
ఇప్పటికే గ్లింప్స్ మరియు మొదటి లిరికల్ వీడియో సాంగ్ సెన్సేషనల్ హిట్స్ అవ్వడం తో ఈ సినిమా పై అంచనాలు ఎవ్వరూ ఊహించనంత రేంజ్ కి చేరిపోయాయి. ఇప్పుడు ఈ టీజర్ కట్ కూడా పేలితే ఈ చిత్రం కనీవినీ ఎరుగని రేంజ్ అంచనాలు ఏర్పడుతాయి. అంటే బాహుబలి 2 , పుష్ప 2 రేంజ్ లో అన్నమాట. ఇలా వారానికి ఒక అప్డేట్ తో అభిమానులను ఉక్కిరి బిక్కిరి చేయడానికి సిద్ధమైపోయింది మూవీ టీం. ఇలా ఈ నెల మొత్తం ప్రమోషనల్ కంటెంట్ మీద ద్రుష్టి పెట్టి, వచ్చే నెల మొత్తం ఇంటర్వ్యూస్ మరియు ఇతర ప్రమోషనల్ ఈవెంట్స్ పై ద్రుష్టి పెట్టబోతున్నారని టాక్. పవన్ కళ్యాణ్ అభిమానులు రాజకీయ పరంగా తమ లీడర్ స్థానం చూసి మంచి జోష్ మీద ఉన్నారు, సినిమాల పరంగా మాత్రం వాళ్ళు సంతృప్తి గా లేరు. ఓజీ చిత్రం విడుదలై సెన్సేషన్ సృష్టించి మళ్ళీ పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానం లో కూర్చునే వరకు వాళ్ళు శాంతించేలా లేరు, చూడాలి మరి వాళ్ళ ఆశలను ఈ సినిమా ఎంత వరకు నిలబెడుతుందో అనేది.