Game Changer: #RRR వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత గ్లోబల్ స్టార్(Global Star Ram Charan) రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రం ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చిన సంగతి తెలిసిందే. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ చిత్రం ఫ్లాప్ అవ్వడం తో వాళ్లలో కలిగిన బాధ గురించి వర్ణించడానికి కూడా కష్టమే. పైగా సోషల్ మీడియా లో దురాభిమానుల ట్రోల్స్ తో పాటు, కొన్ని మీడియా చానెల్స్ టార్గెట్ చేసి మరీ రామ్ చరణ్ పై అనేక నెగిటివ్ ప్రచారాలను చేయడం వాటిని అభిమానులు చూసి బాధపడడం, ఇలా ఒక్కటా రెండా ‘గేమ్ చేంజర్’ మిగిలిచిన చేదు జ్ఞాపకాల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అవుతుంది. పైగా ఆ చిత్ర నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ పదే పదే గేమ్ చేంజర్ ఫలితం గురించి ప్రస్తావిస్తూ రామ్ చరణ్ అభిమానులను రెచ్చగొట్టే విధంగా రీసెంట్ గా వాళ్ళు చేసిన వ్యాఖ్యలను కూడా మనమంతా చూశాము.
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
ఇదంతా పక్కన పెడితే ‘గేమ్ చేంజర్’ ఫ్లాప్ అవ్వడం పై ఇండస్ట్రీ లో అనేకమంది సంతోషించారని, సెలబ్రేషన్స్ కూడా జరుపుకున్నారని చాలా కాలం నుండి సోషల్ మీడియా లో ఒక రూమర్ తిరుగుతుంది. నేడు యూట్యూబ్ లో ఒక ప్రముఖ యూట్యూబర్ మాట్లాడుతూ ‘నేను మొన్న ఒక సినిమాకు నెగటివ్ రివ్యూ ఇస్తే మీరు ఫోన్ చేసి మరీ నన్ను అభినందించారు చాలా బాగా చెప్పావని, ఇప్పుడు మీ సినిమాలోని తప్పులు వెతికి చెప్తే నన్ను తిడుతున్నారు. ఇదెంతవరకు న్యాయం’ అంటూ ప్రశ్నించాడు. ఈ వీడియో సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. అలా ఫోన్ చేసి అభినందించిన నిర్మాత మరెవరో కాదు, నాగవంశీ అని, ఇది గేమ్ చేంజర్ మూవీ సమయం లో జరిగి ఉండొచ్చని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంచనా వేస్తున్నారు.
సంక్రాంతి సమయం లో ‘గేమ్ చేంజర్’ తో పాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు విడుదల అయ్యాయి. ‘డాకు మహారాజ్’ చిత్రానికి నిర్మాతగా నాగవంశీ వ్యవహరించాడు. పోటీ లో ‘గేమ్ చేంజర్’ చిత్రం ఉంది కాబట్టి, ఆ సినిమా గురించి నెగిటివ్ చెప్పడం తో ఆయన సంతోషిస్తూ ఆ ప్రముఖ రివ్యూయర్ కి ఫోన్ చేసి అభినందించి ఉండొచ్చు అంటూ చెప్పుకొస్తున్నారు. ఈ వీడియో పై ఇప్పుడు సోషల్ మీడియా లో రామ్ చరణ్ అభిమానులు చాలా ఫైర్ మీద ఉన్నారు. ఇది కచ్చితంగా మా హీరో గేమ్ చేంజర్ సినిమా గురించే అయ్యి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. మరి క్రింద మేము అందిస్తున్న వీడియో ని చూసిన తర్వాత మీకేమి అనిపించిందో కామెంట్స్ రూపం లో తెలియజేయండి.