OG : తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలందరూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) లాంటి నటుడు ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి ఆయన చేస్తున్న సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరి వాటిని పూర్తిగా కంప్లీట్ చేసిన తర్వాత ఆయన కొత్త సినిమాలకి కమిట్ అవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో భారీ విజయాలను సాధించి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకుల్లో విశేషమైన స్పందన అయితే ఉండేది. ఆయన ఇప్పుడు పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటం వల్ల సినిమాలను కొంతవరకు నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆయన సినిమా రిలీజ్ అయితే మాత్రం భారీ విజయాన్ని అందుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులతో పోటీపడుతూ మరి ఆయన స్థాయిని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
Also Read : ‘ఓజీ’ ఈ ఏడాది లో విడుదల అవ్వడం కష్టమేనా..? జూన్ లో ఏమి జరగబోతుంది?
ఇక ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (Harihara Veeramallu) సినిమాని రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో మేకర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత దసర కానుకగా ఓజీ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో ఆ సినిమా దర్శక నిర్మాతలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని రీసెంట్గా దర్శకుడు సుజిత్ (Sujeeth), ప్రొడ్యూసర్ డివివి దానయ్య స్పష్టం చేశారు.
మరి వీళ్ళతోపాటు పవన్ కళ్యాణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి చాలా పాజిటివ్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు జరిగిన షూటింగ్ మొత్తాన్ని కనక చూసినట్టయితే అందులో పవన్ కళ్యాణ్ చాలా అద్భుతంగా నటించి తన నట విశ్వరూపాన్ని చూపించినట్టుగా తెలుస్తోంది. మరి ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు అనేది తెలియాల్సి ఉంది.
ఎప్పటినుంచో ఒక భారీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా అందిస్తుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక పవన్ కళ్యాణ్ నుంచి ఈ మధ్యకాలంలో ఒక్క సినిమా కూడా రాలేదు. కాబట్టి ఒక్క సినిమా వస్తే చాలు చూసి పరితపించి పోతాం అంటూ అతని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..?