OG : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోకి దక్కని క్రేజ్ అతని సొంతం అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి స్టార్ హీరో నుంచి ఒక సినిమా వస్తే చూడాలని అతని అభిమానులతో పాటు ప్రేక్షకులందరు చాలా వరకు ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే సెట్స్ మీద ఉంచిన ‘హరిహర వీరమల్లు ‘ సినిమాను తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజి (OG) సినిమాను సైతం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం దసర కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక సుజిత్ సైతం ఈ సినిమాను తొందరగా ఫినిష్ చేసి సినిమా చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో సుజీత్ భారీ విజయాన్ని అందుకుంటాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా రిలీజ్ అయితే రికార్డులు బ్రేక్ అవ్వాల్సిందేనా..?
ఇక పవన్ కళ్యాణ్ లాంటి నటుడు దొరికితే మంచి కమర్షియల్ సినిమాను చేసి సక్సెస్ ని సాధించాలని అనుకునే దర్శకులు ఉన్న సందర్భంలో సుజీత్ మాత్రం పవన్ కళ్యాణ్ ని ఇంతవరకు ఎవరు చూపించనటువంటి ఒక కొత్త అవతారంలో చూపించి భారీ ఇండస్ట్రీ హిట్ ని దక్కించుకోవాలనే ఉద్దేశ్యంతో సుజీత్ ముందుకు సాగుతున్నాడు…
మరి తను అనుకుంటున్నట్టుగానే ఈ సినిమాతో విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఈ సినిమాతో కనక భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం సుజిత్ స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకుంటాడు. లేకపోతే మాత్రం ఆయన భారీగా డీలా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి.
ఇక ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటివరకు కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన సుజీత్ తన తదుపరి ఫ్యూచర్ మీద భారీ ఫోకస్ ని పెడుతూ ఎక్కువ సంఖ్యలో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది…మరి సుజీత్ కి ఈ సినిమాతో భారీ సక్సెస్ దక్కుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది…
Also Read : ‘ఓజీ’ నుండి సెన్సేషనల్ అప్డేట్..అభిమానులకు ఇక పండగే!