OG Movie : మన టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతున్న స్టార్ హీరోల పాన్ ఇండియన్ చిత్రాలలో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలతో ఎదురు చూస్తున్న చిత్రం ‘ఓజీ'(They Call Him OG). పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లోనే అత్యంత భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రమిది. ఈ సినిమా ని అధికారికంగా ప్రకటించిన రోజు నుండే ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఇక ఎప్పుడైతే గ్లింప్స్ వీడియో ని విడుదల చేసారో, అప్పటి నుండి ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతలా ఎదురు చూస్తున్నారో, ప్రేక్షకులు కూడా అంతలా ఎదురు చూస్తున్నారు. దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, వంద శాతం పూర్తి అయ్యి మన ముందుకు రావాలంటే పవన్ కళ్యాణ్ 25 రోజుల డేట్స్ ఇవ్వాలి. జూన్ నెల నుండి ఆయన డేట్స్ ఇచ్చే అవకాశం ఉందట.
Also Read : దేవర’ జపాన్ క్లోజింగ్ కలెక్షన్స్..’రంగస్థలం’ కి దరిదాపుల్లో లేదుగా!
మంగళగిరి లో భారీ సెట్టింగ్స్ ని కూడా ఈ సినిమా కోసం ఏర్పాటు చేశారు. అన్ని అనుకున్న విధంగా జరిగితే ఈ చిత్రాన్ని సెప్టెంబర్ నెలలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. కానీ పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ ని చూస్తుంటే అది అసాధ్యం అని అంటున్నారు విశ్లేషకులు. నాన్ స్టాప్ గా 25 రోజుల డేట్స్ ఇస్తే షూటింగ్ పూర్తి అవుతుంది. కానీ పవన్ కళ్యాణ్ అలా ఇవ్వండం లేదు, నాలుగు రోజుల షూటింగ్ చేస్తే, నెల రోజులు గ్యాప్ ఇస్తున్నాడు. ఇలా జరిగితే మాత్రం ఈ ఏడాది ఈ సినిమా విడుదల అవ్వడం కష్టమే అని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ ఈ ఏడాది ఈ సినిమా విడుదల మిస్ అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి 10 న ఈ సినిమాని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.
ఫిబ్రవరి అంటే సినిమాలకు డల్ సీజన్ అని అందరూ అంటుంటారు. అలాంటి డల్ సీజన్ లో విడుదల చేస్తే నష్టాలు భారీగా వస్తాయని ట్రేడ్ అభిప్రాయం. అలాంటి సీజన్ ని ఎంచుకోవడం ఏమిటి అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. పోనీ మార్చి నెలకు షిఫ్ట్ అవుదామా అంటే అదే నెలలో రెండు పెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో రామ్ చరణ్ ‘పెద్ది’ చిత్రం కూడా ఉంది. కాబట్టి ఆ రష్ లో విడుదల చేయడం కంటే సోలో సీజన్ లో విడుదల చేస్తే భారీ వసూళ్లు వస్తాయి అనేది నిర్మాతల ప్లాన్. ఎందుకంటే ఓజీ చిత్రంలో అద్భుతమైన కంటెంట్ ఉంది. సరైన సీజన్ లో ఆ సినిమా రావాల్సిన అవసరం లేదు. ఆ సినిమా వచ్చినప్పుడే సరైన సీజన్ అని మేకర్స్ బలమైన విశ్వాసంతో ఉన్నారు. సాధ్యమైనంత వరకు ఈ ఏడాది లోనే విడుదల చేస్తారట. ఒకవేళ మిస్ అయితే ఫిబ్రవరి ని ఎంచుకున్నట్టు తెలుస్తుంది.