Laya: ఈమె తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ జరిగిపోని స్థానాన్ని సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్ లయ తన కుటుంబంతో కలిసి అమెరికాలో ఉంటుంది. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన లయ ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని తన ఫ్యామిలీతోనే ఎంజాయ్ చేస్తుంది. ఒకప్పుడు తెలుగులో ఈమె చాలా తక్కువ సినిమాలు చేసినా కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. నాలుగవ తరగతి చదువుతున్న సమయంలోనే లయకు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. కానీ అన్ని సినిమాల లాగా ఆ సినిమా రిలీజ్ అవ్వకపోవడం వలన చాలామందికి ఈ విషయం తెలియదు అని చెప్పొచ్చు. ఆ తర్వాత లయ విజయవాడలో పదవ తరగతి చదువుతున్న సమయంలో అవకాశం వచ్చింది. 1996లో కే రాఘవేందర్రావు కొత్త సినిమాలో నటీనటుల కోసం జెమినీ టీవీలో స్టార్ 2000 పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ పోటీలకు లయ ఫోటోలను కూడా పంపించడం జరిగింది. ఈ పోటీలలో లయ రెండవ స్థానంలో నిలిచింది. అయితే ఈ పోటీలో మొదటి స్థానంలో ఉన్న వాళ్లకే హీరోయిన్గా అవకాసం ఇస్తామనడంతో లయ చాన్స్ మిస్ చేస్తుంది. ఇలా లయ పరదేశి సినిమాలో నటించే అవకాశాన్ని అందుకోలేకపోయింది.
Also Read: ఓజీ వచ్చేది అప్పుడే…మరోసారి క్లారిటీ ఇచ్చిన దర్శక నిర్మాతలు…
ఆ తర్వాత లయ ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలో స్వయంవరం సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం పొందింది. 1999లో ఏప్రిల్ నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్ లయ గ్లామర్ షోకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకుంటూ సినిమాలు చేస్తూ సాంప్రదాయ చీర కట్టులో తెలుగు ప్రేక్షకుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. స్వయంవరం సినిమాలో లయ వేణు తొట్టెంపూడి కి జోడిగా నటించి ప్రేక్షకులను అలరించింది. మొదటి సినిమాతోనే హీరోయిన్ గా తన నటనతో మంచి మార్కులు తెచ్చుకుంది. ఆ తర్వాత లయ తెలుగులో ప్రేమించు, మిస్సమ్మ, హనుమాన్ జంక్షన్ వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
కెరియర్ వరుస అవకాశాలతో బాగా బిజీగా ఉన్న సమయంలోనే లయ డాక్టర్ శ్రీ గణేశన్ అన్న పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత లయ సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసి అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం లయ, శ్రీ గణేశన్ దంపతులకు ఒక కూతురు మరియు ఒక కొడుకు ఉన్నారు. అయితే లయ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో టచ్ లో ఉంటుంది. పలు ఇంటర్వ్యూలలో కూడా లయ పాల్గొని తన జీవిత విశేషాలు గురించి పంచుకుంటూ ఉంటుంది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో లయ తన జీవితం గురించి పది ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. ప్రస్తుతం లయ అమెరికాలోని ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో పనిచేస్తున్నట్లు తెలిపింది. నెలకు ఈమె సుమారు పది లక్షల రూపాయలు ఆదాయం పొందుతున్నట్లు చెప్పుకొచ్చింది.