Odela 2 Movie : కొన్ని సినిమాలు విడుదలకు ముందు టీజర్స్, ట్రైలర్స్ మరియు ప్రొమోషన్స్ తో ఆడియన్స్ ని ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది. కేవలం వాటిని చూసి ఆడియన్స్ కళ్ళు మూసుకొని థియేటర్స్ కి వెళ్తుంటారు. కానీ చివరికి ఆ సినిమా అంచనాలకు తగ్గట్టుగా అనిపించవు. తీవ్రమైన నిరాశతో థియేటర్స్ నుండి ఇంటికి తిరిగి వెళ్తారు. అలాంటి కోవకు చెందిన సినిమానే రీసెంట్ గా విడుదలైన ‘ఓదెల 2′(Odela 2 Movie) చిత్రం. తమన్నా(Tammannah Bhatia) హీరోయిన్ గా సంపత్ నంది(Sampath Nandi) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉండేవి. ఎందుకంటే గతంలో సంపత్ నంది తెరకెక్కించిన ‘ఓదెల రైల్వే స్టేషన్’ అనే చిత్రం ఆహా యాప్ లో విడుదలై సెన్సేషనల్ రెస్పాన్స్ ని దక్కించుకుంది కాబట్టి. అదే విధంగా ట్రైలర్, టీజర్ కూడా ప్రత్యేకంగా ఆడియన్స్ ని ఆకర్షించింది. విడుదలై మూడు రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత వసూళ్లను రాబట్టింది అనేది ఇప్పుడు వివరంగా చూద్దాము.
Also Read : కోట్ల రూపాయిలు సంపాదిస్తున్న ‘పుష్ప’ డూప్..స్టార్ హీరోలు కూడా పనికిరారు!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 11 కోట్ల రూపాయలకు జరిగింది. కానీ మొదటి మూడు రోజుల్లో ఈ చిత్రానికి వచ్చిన వసూళ్ళు కేవలం రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే. అందులో నైజాం ప్రాంతం నుండి 66 లక్షలు, సీడెడ్ ప్రాంతం నుండి 24 లక్షలు, ఆంధ్ర ప్రాంతం నుండి 80 లక్షలు, మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి కోటి 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా ఓవర్సీస్, కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి కేవలం 32 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి రెండు కోట్ల రెండు లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
తమన్నా ఈ చిత్రం కోసం నాలుగు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంది. ఇప్పటి వరకు కనీసం సగం కూడా అందులో రీకవర్ అవ్వకపోవడం గమనార్హం. ఓవరాల్ గా ఫుల్ రన్ లో కచ్చితంగా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది కానీ, కమర్షియల్ గా ఈ చిత్రం డబుల్ డిజాస్టర్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ రేపటి నుండి ఈ చిత్రం డీసెంట్ స్థాయిలో షేర్స్ ని రాబట్టగలిగితే కచ్చితంగా ఫుల్ రన్ లో మరో రెండు కోట్లు అదనంగా రావొచ్చు కానీ, సక్సెస్ అయ్యే అవకాశాలు మాత్రం లేవు. విడుదలకు ముందే నిర్మాతకు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా భారీ లాభాలు వచ్చాయి. కానీ బయ్యర్స్ కి నష్టాలు తప్పేలా లేవు.ఓవరాల్ గా ఈ చిత్రం మేకర్స్ కి సక్సెస్ ఫుల్ ప్రాజెక్ట్, బయ్యర్స్ కి డిజాస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Also Read : రీ రిలీజ్ కి సిద్దమైన మహేష్ బాబు డిజాస్టర్ మూవీ..’అతడు’ ఇక లేనట్టే!