nuvve nuvve movie: తరుణ్ హీరోగా చేసిన ‘నువ్వే నువ్వే’ సినిమా నిన్నటితో 20 ఏళ్లను పూర్తిచేసుకుంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన సెలబ్రేషన్స్ కి, స్రవంతి రవికిశోర్ .. త్రివిక్రమ్ .. హీరో తరుణ్ .. హీరోయిన్ శ్రియ .. ప్రకాశ్ రాజ్ హాజరయ్యారు. ఈ వేదికపై తరుణ్ మాట్లాడుతూ .. ‘నువ్వే నువ్వే’ సినిమా చేసి అప్పుడే 20 ఏళ్లు అయిందా అనిపిస్తోంది. నాకు మాత్రం నిన్నగాక మొన్న చేసినట్టుగా ఉంది” అన్నాడు.

“ఇప్పటికి కూడా నాకు ఎప్పుడైనా బోర్ కొడితే ఈ సినిమాలోని సీన్స్ ను చూసుకుంటూ ఉంటాను. రామోజీరావు గారు – రవి కిశోర్ గారు ఇద్దరూ కలిసి ‘నువ్వే కావాలి’ సినిమాతో నన్ను హీరోగా పరిచయం చేశారు. స్రవంతి బ్యానర్లో వరుసగా మూడు సినిమాలు చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. వరుసగా మూడు వండర్ఫుల్ మూవీస్ ఇచ్చినందుకు ఆయనకి థ్యాంక్స్ చెబుతున్నాను.
Also Read: Prabhas- Maruthi: అమ్మ మారుతీ… ప్రభాస్ చుట్టూ ఇంత కుట్ర పన్నావా!

రోగా నా ఫస్టు మూవీకి త్రివిక్రమ్ గారు డైలాగ్స్ రాశారు. డైరెక్టర్ గా ఆయన ఫస్టు సినిమాకి హీరోగా నేను చేయడం నాకు ఎంతో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. ఇకపై ఆయన ఎంతమంది హీరోలతో చేసినా ఆయన ఫస్టు హీరో మాత్రం నేనే. ఇప్పటికీ నేను ఎక్కడికైనా వెళితే, ‘నువ్వే నువ్వే’ లాంటి సినిమా ఇంకొక్కటి చేయండి” అని అడుగుతూ ఉంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: Supreme Court Judge DY Chandrachud: సుప్రీంకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా డీవై.చంద్రచూడ్!