Homeఎంటర్టైన్మెంట్JrNTR: ఎన్టీఆర్ సినిమాకి అతను ఫిక్స్ !

JrNTR: ఎన్టీఆర్ సినిమాకి అతను ఫిక్స్ !

ఎన్టీఆర్ తో ‘అనిరుధ్ రవిచందర్’0 (anirudh ravichander) ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఫిక్స్ అయిన కాంబినేషన్ ఇది. సంగీతం దర్శకుడు అనిరుధ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గత రెండు సినిమాలుగా పని చేయడానికి ఎదురుచూశాడు. కానీ కుదరలేదు. అయితే, ఎన్టీఆర్ చొరవతో ఇప్పుడు ఈ కలయిక కుదర బోతుంది. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. కాగా కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే […]

NTR To Get Anirudh On Board?ఎన్టీఆర్ తో ‘అనిరుధ్ రవిచందర్’0 (anirudh ravichander) ఒక సినిమా చేయాల్సి ఉంది. గతంలో ఫిక్స్ అయిన కాంబినేషన్ ఇది. సంగీతం దర్శకుడు అనిరుధ్ కూడా ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి గత రెండు సినిమాలుగా పని చేయడానికి ఎదురుచూశాడు. కానీ కుదరలేదు. అయితే, ఎన్టీఆర్ చొరవతో ఇప్పుడు ఈ కలయిక కుదర బోతుంది. ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు.

కాగా కొరటాల శివ – ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపొందే ఈ సినిమాకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా అందుకు సంబంధించిన అగ్రిమెంట్ కూడా పూర్తి అయిందని తెలుస్తోంది. పైగా అనిరుధ్ కి భారీ పారితోషికం కూడా ఇచ్చేందుకు సిద్ధమయ్యారు ఎన్టీఆర్ టీమ్. ప్రస్తుతం కొరటాల శివ ‘ఆచార్య’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి మెలోడీ బ్రహ్మ మణిశర్మతో సంగీతం చేయిస్తున్నాడు.

నిజానికి తన మొదటి నాలుగు సినిమాలకు కొరటాల, దేవిశ్రీ ప్రసాద్ తో సంగీతం చేయించాడు. కానీ ఏమైందో ఏమో గానీ, గత రెండు సినిమాల నుండి కొరటాల దేవిని రిపీట్ చేసే ఆలోచనలో లేడు. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఇంతకుముందు వచ్చిన ‘జనతా గ్యారేజ్’ పాటలు బాగా క్లిక్ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు చేసే సినిమా సాంగ్స్ అంతకు మించి ఉండాలనేది కొరటాల – ఎన్టీఆర్ ఆలోచన. ఈ మధ్య దేవి నుండి బెస్ట్ సాంగ్స్ రావడం లేదు. అందుకే, దేవి ప్లేస్ లో అనిరుధ్ ను తీసుకుంటున్నారు. అన్నట్టు ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు వేరియేషన్స్ లో కనిపించనున్నాడు. ఇక ఏప్రిల్‌ 22, 2022న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper