NTR-Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ కెరీర్ లో ‘మంగమ్మగారి మనవడు’ సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. పైగా తెలుగు సినిమా చరిత్రలో కూడా ఈ సినిమాకు ఓ రికార్డు ఉంది. 365 రోజులు ఆడిన ఈ సినిమా బాలయ్య కెరీర్ ను టాప్ గేర్ లోకి తీసుకువెళ్లింది. అయితే, ఈ సినిమా తమిళ సినిమా ‘మణ్ వాసనై’ సినిమాకి రీమేక్, తమిళంలో భారతీరాజా ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అక్కడ రికార్డు స్థాయిలో ఈ సినిమా సూపర్ హిట్ అయింది.
దాంతో తెలుగులో ఈ చిత్రాన్ని కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘మంగమ్మగారి మనవడు’ పేరుతో రీమేక్ చేశారు. అయితే, విచిత్రంగా తమిళంను మించి ఈ చిత్రం డబుల్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలో కీలకమైన ‘మంగమ్మ’ పాత్రను సీనియర్ నటిమణి భానుమతితో చేయించడం విశేషం. అయితే ఈ పాత్రను భానుమతిగారు చేయడానికి ముందు ఒక సంఘటన జరిగింది. ఈ పాత్రను భానుమతిగారు మాత్రమే చేయాలని.. . ఆమె ఒప్పుకోకపోతే ఈ సినిమాను వదిలివేయమని ఎన్టీఆర్ స్వయంగా చెప్పారు.
పైగా ఎన్టీఆర్ గారు ఫోన్ చేసి మరీ, ఈ చిత్రంలో నటించాలని భానుమతి గారిని ఎన్టీఆర్ ఒప్పించారట. భానుమతి గారు బహుముఖ నటి, పైగా గొప్ప ప్రజ్ఞాశాలి. అన్నిటికి మించి ఆమె నిర్మాత, అలాగే ఆమెలో ఒక దర్శకురాలు కూడా ఉంది. అదే విధంగా స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు ఇలా చెప్పుకుంటూ పోతే భానుమతి గారు గొప్ప టాలెంట్ కలిగిన స్త్రీ మూర్తి.
Also Read: సినిమా మొదలయ్యాక శ్రీహరి మరణం.. జగపతి బాబు వద్దకు క్యారెక్టర్.. ఆయన ఏమన్నారంటే..?
అందుకే, ‘మంగమ్మగారి మనవడు’ సినిమాను రీమేక్ చేయాలని నిర్ణయించుకున్నాక, సినిమా కాస్ట్, క్రూ సెట్ ఫైనల్ అయ్యాక.. ఎన్టీఆర్ గారు బాలయ్యను పిలిచి మూడు విషయాలు తప్పకుండా పాటించాలని కండిషన్ పెట్టారట. ఇంతకీ ఏమిటి ఆ కండీషన్లు అంటే.. భానుమతి కంటే అరగంట ముందే షూటింగ్ కి వెళ్ళాలి అని, ఏ ఒక్క రోజూ కూడా నీ వల్ల ఆమె వెయిట్ చేయకూడదు అని, భానుమతి సెట్స్ లోకి రాగానే ఆమె కారు డోర్ నువ్వే తీయాలని కండీషన్ పెట్టారట.
అలాగే ఆశ్చర్యకరంగా భానుమతి గారు కారులో నుంచి దిగిన వెంటనే భానుమతి గారి కాళ్లకు నమస్కారం పెట్టాలని కూడా ఎన్టీఆర్ చెప్పారట. అప్పటి నుంచే బాలయ్యకి సీనియర్ నటీనటులకు మర్యాద ఇవ్వడం అలవాటు అయిందట. ఇక ‘మంగమ్మగారి మనవడు’ సినిమా షూటింగ్ జరిగినన్ని రోజులు బాలయ్య, ఎన్టీఆర్ గారు చెప్పినట్టే చేశారు. బాలయ్య తీరు చూసి భానుమతిగారు పొంగిపోయారట. ఆ తర్వాత కూడా బాలయ్య – భానుమతి మధ్య బంధం అలాగే కొనసాగింది.
Also Read: ఈ ఏడాది వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్న సినీ వారసులు వీళ్లే..