https://oktelugu.com/

Khali Pushpa Dialogue: పుష్ప డైలాగ్ః త‌గ్గేదే లే అంటున్న ఖ‌లీ

Khali Pushpa Dialogue: తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పుష్ప రికార్డులు మోత మోగుతున్నాయి. అందులో ఉండే పాట‌లు, డైలాగులు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఏదైనా చిత్రం వ‌స్తే దానికి సంబంధించిన మాట‌లు వైర‌ల్ కావ‌డం తెలిసిందే. అది సంప్ర‌దాయం కూడా. దీంతో పది కాలాల పాటు అవి ప్ర‌జ‌ల మ‌దిలో ఓల‌లాడుతూనే ఉంటాయి. ఇదే కోవ‌లో పుష్ప చిత్రంలోని ఓ డైలాగ్ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. త‌గ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చేసిన న‌ట‌న అంద‌రిని క‌ట్టిప‌డేసింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 30, 2022 / 01:26 PM IST
    Follow us on

    Khali Pushpa Dialogue: తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌లో పుష్ప రికార్డులు మోత మోగుతున్నాయి. అందులో ఉండే పాట‌లు, డైలాగులు అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందుతున్నాయి. ఏదైనా చిత్రం వ‌స్తే దానికి సంబంధించిన మాట‌లు వైర‌ల్ కావ‌డం తెలిసిందే. అది సంప్ర‌దాయం కూడా. దీంతో పది కాలాల పాటు అవి ప్ర‌జ‌ల మ‌దిలో ఓల‌లాడుతూనే ఉంటాయి. ఇదే కోవ‌లో పుష్ప చిత్రంలోని ఓ డైలాగ్ అంద‌రిని ఆక‌ట్టుకుంటోంది. త‌గ్గేదే లే అంటూ అల్లు అర్జున్ చేసిన న‌ట‌న అంద‌రిని క‌ట్టిప‌డేసింది. దీంతో పుష్ప ఒర‌వ‌డి కొన‌సాగుతూనే ఉంది. క్లాస్ నుంచి మాస్ వ‌ర‌కు అంద‌రూ పుష్ప డైలాగ్ కు ఫిదా అయిపోతున్నారు.

    Khali Pushpa Dialogue

    సినీ ప్ర‌ముఖులు, క్రీడాకారులు, రాజ‌కీయ నాయ‌కులు త‌మ‌దైన శైలిలో పుష్ప డైలాగులు వ‌ల్లిస్తున్నారు. దీంతో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నారు. ఇప్ప‌టికే ఆస్ర్టేలియా క్రికెట‌ర్ వార్న‌ర్, ఇండియ‌న్ క్రికెట‌ర్లు సురేష్ రైనా, హార్థిక్ పాండ్యా లాంటి వారు పుష్ప పాట‌ల‌కు స్టెప్పులు సైతం వేశారు. దీంతో పుష్ప క్రేజ్ మ‌రింత పెరిగింది. అల్లు అర్జున్ సినీ జీవితంలోనే ఓ మైలురాయిగా నిల‌వ‌నుంది. దీనికి సంబంధించిన పాట‌లు, డైలాగులు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

    Also Read: ప్రభాస్ పై పునీత్ రాజ్‌ కుమార్ ఎఫెక్ట్ !

    ది గ్రేట్ ఖ‌లీ చెప్పిన త‌గ్గేదేలే డైలాగ్ కు ప్ర‌జాద‌ర‌ణ ల‌భిస్తోంది. ఆయ‌న చెప్పిన డైలాగుకు ఇన్ స్టా గ్రామ్ లో 4 ల‌క్ష‌ల లైకులు రావ‌డం సంచ‌ల‌న‌మే. దీంతో పుష్ప సినిమా రేంజ్ మ‌రోసారి పెరిగింది. స‌రికొత్త క‌థ‌నంతో తెర‌కెక్కిన పుష్ప సినిమా గురించి తెలుగు ప‌రిశ్ర‌మ‌లో ఖ్యాతి పెరుగుతోంది. అల్లు అర్జున్ న‌ట‌న కూడా ఓ మైలురాయిగా నిలుస్తోంది. స‌రికొత్త ట్రెండ్ ను సెట్ చేస్తున్న పుష్ప చిత్రం దూసుకుపోతోంది. అత్యంత భారీ వ‌సూళ్లు చేసే చిత్రంగా రికార్డులు తిర‌గ‌రాస్తోంది.

    హిందీలో కూడా ఈ చిత్రం భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టుకుంది. వెయ్యి కోట్ల వ‌ర‌కు క‌లెక్ష‌న్లు సాధించి స‌రికొత్త చ‌రిత్ర లిఖించింది. ద‌ర్శ‌కుడు సుకుమార్ ప్ర‌తిభ‌కు తార్కాణంగా నిలుస్తోంది ఈ చిత్రం. భ‌విష్య‌త్ లో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేష‌న్ లో మ‌రిన్ని చిత్రాలు వ‌చ్చి ఇలాగే విజ‌యవంతం కావాల‌ని ప్రేక్ష‌కులు కోరుతున్నారు. వీరి కాంబినేష‌న్ లో వ‌చ్చిన ఆర్య కూడా రికార్డులు మోగించింది. త‌రువాత వ‌చ్చిన పుష్ప ఈ రీతిలో విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.

    Also Read: రవితేజతో ప‌వ‌న్‌ క‌ల్యాణ్ మాజీ భార్య‌ !

    Tags