https://oktelugu.com/

Sandeep Reddy Vanga – Jr NTR: ఎన్టీయార్ – సందీప్ వంగ కాంబో లో సినిమా వచ్చేది అప్పుడేనా..? తారక్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే ఫ్యాన్స్ కి పూనకాలే…

Sandeep Reddy Vanga - Jr NTR: సినిమా ఇండస్ట్రీలో కొంతమంది దర్శకులు మాత్రమే చాలా హై లెవెల్లో సినిమాలను తీస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతూనే తమ సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలిపే ప్రయత్నం చేస్తుంటారు...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 7, 2024 / 11:16 AM IST
    Follow us on

    Sandeep Reddy Vanga – Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ తనదైన రీతిలో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇప్పటికే ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాలను సాదిస్తుండటం ఆయనకు చాలా వరకు ప్లస్ పాయింట్ గా మారుతుంది. ఇప్పటికే ఆయన వరుసగా ఏడు సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. మరి ఇకమీదట చేయబోయే సినిమాలను కూడా సక్సెస్ ఫుల్ గా నిలవాలనే ఉద్దేశ్యంతోనే ఆచితూచి మరి సినిమాలను సెలెక్ట్ చేసుకొని మరి ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఆయన బాలీవుడ్ స్టార్ హీరో అయిన హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 అనే సినిమాలో నటిస్తున్నాడు.

    ఇక దాంతో పాటుగా తెలుగులో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే మూవీ కూడా చేస్తున్నాడు. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా ఆయన తొందర్లోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఉండబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. బోల్డ్ సినిమాలను తీయడంలో సందీప్ రెడ్డి వంగా చాలా సిద్ధహస్తుడు. మరి ఎన్టీఆర్ తో కూడా అలాంటి ఒక బోల్డ్ మూవీ ని తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలపాలనే ప్రయత్నంలో సందీప్ రెడ్డి వంగా ఉన్నాడట.

    ఇప్పటికే ఎన్టీఆర్ తో చేయాల్సిన సినిమాకు సంబంధించిన కథను కూడా తను రెడీ చేసి పెట్టుకున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ సినిమాతో తను ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించబోతున్నాడు.

    మరి ప్రభాస్ ని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో చూపిస్తున్న సందీప్ ఎన్టీఆర్ ని మాత్రం అండర్ వరల్డ్ డాన్ క్యారెక్టర్ లో చూపించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ ఎన్టీఆర్ కాంబోలో సినిమా రావాలంటే మాత్రం ఇంకా రెండు మూడు సంవత్సరాల సమయం పట్టే అవకాశం అయితే ఉంది.

    ఎందుకంటే స్పిరిట్ సినిమా తర్వాత సందీప్ ‘అనిమల్ పార్క్’ సినిమాని తెరకెక్కిస్తాడు. ఇక ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ రెండు సినిమాలు పూర్తి అయిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేసే అవకాశాలైతే ఉన్నాయి…