Pawan Kalyan and Trivikram: పవన్ అక్కడ.. త్రివిక్రమ్ ఇక్కడ.. పెద్దరికంపై ఫైర్ అవుతున్న సినీ పెద్దలు…
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే ఇక్కడ సరైన గుర్తింపైతే ఉంటుంది. అందులో కొంతమంది స్టార్ హీరోలు వాళ్ళు చేసిన వరుస సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకుంటూ స్టార్ స్టేటస్ ని పొందుతూ ఉంటారు...
Pawan Kalyan and Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది వాళ్ళను వాళ్ళు పవర్ ఫుల్ వ్యక్తులుగా పోట్రే చేసుకోవడానికి చాలావరకు తాపత్రయ పడుతుంటారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అనే వారు ఎవరూ లేకుండా పోయారు. దాసరి నారాయణరావు ఉన్నప్పుడు ఆయనే ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ ఇండస్ట్రీలో వచ్చే ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అక్కడి నుంచి కావాల్సిన నిధులను సమకూర్చి ఇండస్ట్రీ మొత్తాన్ని చాలా బాగా చూసుకోవడానికి తను చాలావరకు ప్రయత్నం చేసేవాడు. అలాగే చిన్న నిర్మాతలకు, చిన్న హీరోలకు అండగా నిలుస్తూ చిన్న సినిమాలను బతికించేవాడు. వాళ్లకు రిలీజ్ సమయంలో కావలసిన థియేటర్లను కేటాయించేవాడు. కానీ ఆయన తర్వాత సినిమా ఇండస్ట్రీలో పెద్దదిక్కు అనేవారు లేకుండా పోవడంతో ఇండస్ట్రీలో ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇబ్బందులు పడేవాళ్లు పడుతున్నారు. అధికారం ఉన్నవాళ్లు వాళ్ళ ఇస్తానుసారంగ ఇండస్ట్రీని వాడేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో చిరంజీవి లాంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా వ్యవహరిస్తారు అని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ వాటి మీద కూడా నెగిటివిటీ ఎక్కువగా పెరగడంతో ఆయన దానిమీద ఎలాంటి స్పందన తెలియజేయకుండా సైలెంట్ గా సైడ్ అయిపోయాడు…
ఇక ఇప్పుడు ఇదిలా ఉంటే ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎంగా పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన పూర్తి బాధ్యతలను తనే దగ్గరుండి మరి చూసుకుంటున్నాడు. ఇక గతంలో సినిమా టికెట్ రేట్లు తగ్గించినప్పుడు అపోజిషన్ లో ఉన్న పవన్ కళ్యాణ్ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించాడు. ఇక అలాంటి ఇబ్బందులు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి రాకూడదనే ఒకే ఒక కారణంతో ఆయనే దగ్గరుండి సినిమా వాళ్ళ ఇబ్బందులను తెలుసుకొని వాటిని సాల్వ్ చేస్తున్నాడు.
ఇక ఈ క్రమంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి కీలకగా భాద్యతలను అప్పగించినట్లుగా కూడా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్న ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరికి వెళుతుంది. ఆ తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ ఆ ప్రాబ్లమ్ ను తెలుసుకొని దానికి ఒక సొల్యూషన్ ని చెప్పి మళ్ళీ వాళ్ళను త్రివిక్రమ్ దగ్గరికి పంపించి సాల్వ్ చేయిస్తున్నాడు. నిజానికి పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు ఆయనే తీసుకొని డైరెక్ట్ గా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ ప్రాబ్లం ను సాల్వ్ చేయచ్చు కానీ మధ్యలో త్రివిక్రమ్ ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకు అంటూ చాలామంది ఈ వ్యవహారం మీద నెగిటివ్ అభిప్రాయాల్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇంతకీ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎవరు అంటూ మరి కొంతమంది కామెంట్లైతే చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ స్నేహితుడు అయినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన బాధ్యతలను చూసుకునే అర్హతగాని, అనుభవం గానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఉందా అనే ఆరోపణలు కూడా వస్తున్నాయి…. ఇక ఇంతకుముందు కొన్ని పెద్ద సినిమాల టికెట్ల రేట్లు పెంచడానికి వాళ్ళందరూ త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ ను కలిసినట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇదంతా తెలుసుకున్న ట్రేడ్ పండితులు సైతం త్రివిక్రమ్ శ్రీనివాస్ ని పక్కన పెట్టి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ సినిమాల గురించి మాట్లాడి వాళ్లకు తగిన సొల్యూషన్ చెబితే బాగుంటుంది అంటూ వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…