https://oktelugu.com/

Pawan Kalyan and Trivikram: త్రివిక్రమ్ కావాలనే పవన్ కళ్యాణ్ కి అందరిని దూరం చేస్తున్నాడా..? ఆయన ప్లాన్ ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న నటుడు పవన్ కళ్యాణ్... మొదట్లో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా సక్సెస్ లను సాధించడంతో ఒక్కసారిగా ఆయన పవర్ స్టార్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా చిరంజీవి తమ్ముడు అంటూ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి అని చెప్పుకునే రేంజ్ కి ఎదిగాడు...

Written By:
  • Neelambaram
  • , Updated On : October 7, 2024 / 11:10 AM IST

    Pawan Kalyan and Trivikram

    Follow us on

    Pawan Kalyan and Trivikram: తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. దర్శకుడుగా ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకున్నాయి. మొదట రైటర్ గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత ఆయన చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ లను సాధించడంతో ఒక్కసారిగా ఆయన స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన తన తదుపరి సినిమా ఎవరితో చేయాలి అనేదానిమీద చాలా రకాల చర్చలైతే జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక దాంతో పాటుగా పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో కూడా త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు వహించి ఆయన ఎలాంటి సినిమాలు చేయాలి అనేది నిర్ణయిస్తూ ఉంటాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ఉండే తన సన్నిహితులందరిని దూరం చేస్తున్నాడు అంటూ కొన్ని విమర్శలైతే వస్తున్నాయి. మొన్నటికి మొన్న బండ్ల గణేష్ ను పవన్ కళ్యాణ్ నుంచి దూరం చేశాడు అంటూ కొంత మంది బండ్ల గణేష్ సన్నిహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

    నిజానికైతే బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ తో పాటు ఉండేవాడు. కానీ త్రివిక్రమ్ ఎంట్రీ ఇచ్చి బండ్ల గణేష్ ని దూరంపెట్టాలని పవన్ కళ్యాణ్ తో చెప్పడంతో ఆయన అలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక ఇప్పుడు మరి కొంతమంది పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వ్యక్తులను కూడా పక్కన పెట్టమని పవన్ కళ్యాణ్ తో చెబుతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

    మరి త్రివిక్రమ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు అనేదానికి కొంత మంది చెప్పే సమాధానం ఏంటంటే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కి ఇంకా దగ్గర అయి ఆయన ద్వారా జరిగే ప్రయోజనాలన్నింటిని తను ఒక్కడే పొందాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇప్పటికే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన విషయం మాకు తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ కు ముఖ్యంగా త్రివిక్రమ్ మాత్రం చాలా సపోర్ట్ ని అందించాడు.

    తన రాతల ద్వారా గాని తన మోటీవ్ స్పీచ్ ల ద్వారా గాని పవన్ కళ్యాణ్ లో ఒక ధైర్యాన్ని అయితే నింపిన వ్యక్తిగా మనం త్రివిక్రమ్ ను అభివర్ణించవచ్చు. కానీ తను పవన్ కళ్యాణ్ చుట్టూ ఉన్నవాళ్లను దూరం చేయడంతో త్రివిక్రమ్ మీద కొంతవరకు నెగిటివ్ అభిప్రాయమైతే ఏర్పడుతుంది…