అభిమానం వెర్రివేషాలు వేయిస్తోంది. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్న సినిమాలో ఒక హీరో పోస్టర్ అదిరిపోగా.. మరో హీరో పోస్టర్ తేలిపోయిందన్న ప్రచారం ఉధృతమైంది.అయితే ఆ ఇద్దరు హీరోలు ఫ్రెండ్స్ సన్నిహితులే.. కానీ వారి అభిమానులు మాత్రం విడిపోయి కొట్టుకుంటూ వెర్రివేషాలు వేస్తున్న వైనం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. ఓ వైపు కోవిడ్ ఇప్పుడు దేశంలో ఉన్న ఏకైక అంశంగా మారింది. కరోనాతో చాలా మంది చనిపోతున్నారు. చుట్టూ లెక్కలేనన్ని కన్నీళ్లు ఉన్నాయి. ఈ సమయంలో టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ల ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని బర్త్ డే ఫస్ట్ లుక్ లపై వ్యతిరేకంగా వారి అభిమానులు ట్రెండింగ్ చేస్తుండడం ఖచ్చితంగా మూర్ఖత్వం అని చెప్పక తప్పదు. ఇంతటి విపత్తులో ఈ అభిమానులు ఎప్పుడు మానవత్వంతో ఆలోచిస్తారో వేచిచూడాల్సిందే..
ప్రపంచవ్యాప్తంగా అందరు హీరోలు కలిసిపోయి సినిమాలు చేస్తున్నారు. అయితే కొంతమంది స్టార్ హీరోల అభిమానులు ఇంకా ఆదిమ శైలిలో ప్రవర్తిస్తారు. అభిమానుల తగాదాలు కొత్తవి కావు. కమర్షియల్ ఇండియన్ సినిమా అంత పాతవి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు ఆర్ఆర్ఆర్ హీరోల అభిమానులు ఒకరితో ఒకరు గట్టిగా పొట్లాడుకుంటున్న దుస్థితి సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన స్టిల్స్ ఒకటి ఆన్‌లైన్‌లో ‘ఆర్ఆర్ఆర్’ టీం తాజాగా విడుదల చేసింది.. కానీ అది అంతగా ఆకట్టుకోలేదు. ప్రజల నుండి పెద్ద స్పందన పొందలేదు.
దీనిని ఎత్తి చూపిస్తూ రాంచరణ్ అభిమానులు ఎన్టీఆర్ అభిమానులను ఎగతాళి చేయడం ప్రారంభించారు. ఇలా ప్రారంభించిన అసభ్య పదాలు.. దుష్ట వ్యక్తీకరణలతో ఒకరినొకరు సోషల్ మీడియాలో అవమానించే స్థాయికి చేరుకున్నారు.. #FanBaseLessNTR మరియు #FanBaseLessRamCharan అనే హ్యాష్‌ట్యాగ్‌లు కొన్ని గంటల క్రితం వరకు ట్విట్టర్ లో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఇది ఖచ్చితంగా తెలుగు సినిమా ఇమేజ్.. తెలుగు ప్రేక్షకుల సంస్కృతిని అణిచివేస్తుంది.
ఏ పోస్ట్ లేదా ఇమేజ్‌కి డబ్బు ఖర్చు చేయకుండా సోషల్ మీడియాలో ఇంత రచ్చ చేయడం ఈ సమయంలో అవసరమా అన్నది వారి ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. బహుశా, కోవిడ్ మహమ్మారి మధ్య ఎన్టీఆర్ , రాంచరణ్, రాజమౌలి ఇలాంటి అభిమానుల హద్దుమీరుతున్న చర్యలను కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.