https://oktelugu.com/

పిల్లలే జగన్ టార్గెటా?

ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. జగన్, బాబు కొత్త ఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు విధానాలు అవలంభిస్తున్నారు. ఒకరు కులం పట్టుకుంటే మరొకరు పిల్లలను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో రాష్ర్టంలో రోజురోజుకు రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. యువత, మహిళలు బలమైన ఓటు బ్యాంకుగా భావిస్తున్నారు. పథకాలు కూడా వారికే అందేలా చర్యలు చేపడుతున్నారు. జగన్ అయితే పిల్లలను సైతం తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. 2024 నాటికి వారిలో కొత్త ఓటర్లుగా […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 22, 2021 / 10:55 AM IST
    Follow us on

    ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. జగన్, బాబు కొత్త ఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పలు విధానాలు అవలంభిస్తున్నారు. ఒకరు కులం పట్టుకుంటే మరొకరు పిల్లలను అట్రాక్ట్ చేస్తున్నారు. దీంతో రాష్ర్టంలో రోజురోజుకు రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. యువత, మహిళలు బలమైన ఓటు బ్యాంకుగా భావిస్తున్నారు. పథకాలు కూడా వారికే అందేలా చర్యలు చేపడుతున్నారు. జగన్ అయితే పిల్లలను సైతం తమ వైపు తిప్పుకునే పనిలో పడ్డారు. 2024 నాటికి వారిలో కొత్త ఓటర్లుగా నమోదు అయ్యే వారు ఎక్కువగా ఉండడంతో వారినే ప్రలోభ పెట్టే పథకాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని తమ వెంట ఉంచుకునేలా ప్రణాళికలు రచిస్తున్నారు.

    బడ్జెట్ రూపకల్పనలో తమదైన ముద్ర వేస్తున్నారు. అన్ని వర్గాలను బుజ్జగించే పనిలో భాగంగా కేటాయింపులు ఉండేలా చూసుకుంటున్నారు. ఈ మధ్య రెడ్డి, కమ్మ, క్షత్రియ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి వారి ఓటు బ్యాంకును సొంతం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ముదిరాజ్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ఉన్నాయి. దీంతో రాష్ర్టంలో కుల ప్రాతిపదికన రాజకీయాలు నడుస్తున్నాయని తెలుస్తోంది. 18 ఏళ్ల లోపు పిల్లల కోసం రూ.16 వేల కోట్ల బడ్జెట్ కేటాయించడమంటే మామూలు విషయం కాదు.

    రాబోయే ఎన్నికల దృష్టితోనే ముందుకు వెళ్తున్నారు. 2024లో అధికారమే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తున్నారు. అన్నివర్గాల ప్రజలను ప్రభావానికి గురి చేసి పబ్బం గడుపుకోవలని భావిస్తున్నాయి. ఇందుకోసం అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఇప్పటి నుంచే పిల్లలను దారిలో పెట్టుకుంటే అప్పటి వరకు వారికి ఓటు హక్కు వచ్చి ఓటు తమకే వేస్తారని అంచనాతో వారికి తాయిలాలు ప్రకటిస్తున్నారు. భవిష్యత్తుపై భరోసాతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. రేపటి ఆశలను సజీవంగా ఉంచచుకోవడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు.

    ఓటు బ్యాంకు రాజకీయాలు నడుస్తున్నాయి. రాష్ర్టంలో ప్రస్తుతం పార్టీలు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కుయుక్తులు పన్నుతున్నాయి. ఎవరినీ వదలకుండా అన్ని వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. దీనికి ఏ పార్టీ అతీతం కాదు. అన్ని ప్రాంతాలను తమ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నాయి. ఇందులో భాగంగా తమ ప్రభావాన్ని మరింత చూపేందుకు నిత్యం ఆలోచిస్తున్నాయి. సామాన్యుడి నుంచి ఉన్నవారి వరకు తమ విధానాలకు మెచ్చి ఓటు వేసి గెలిపించాలని భావిస్తున్నాయి. దీంతో ఏ మేరకు విజయం సాధిస్తాయో వేచి చూడాల్సిందే.