https://oktelugu.com/

KCR- ST Reservations: ఆ జీవో వస్తే నోటిఫికేషన్లకు బ్రేక్‌.. కేసీఆర్‌ నిర్ణయం నిరుద్యోగులకు శాపం!

KCR- ST Reservations: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న తాజా నిర్ణయం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. దీని ప్రభావం ఇటీవల ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లపై పడనుంది. నియామక ప్రక్రియతోపాటు త్వరలో జారీ చేయబోయే నోటిఫికేషన్లన్నీ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే జరిగితే సర్కార్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం మునుగోడు ఉప ఎన్నికతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా పడే అవకాశం ఉంది. […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : September 21, 2022 / 03:46 PM IST
    Follow us on

    KCR- ST Reservations: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీసుకున్న తాజా నిర్ణయం నిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. దీని ప్రభావం ఇటీవల ప్రకటించిన ఉద్యోగ నోటిఫికేషన్లపై పడనుంది. నియామక ప్రక్రియతోపాటు త్వరలో జారీ చేయబోయే నోటిఫికేషన్లన్నీ రద్దు అయ్యే అవకాశం ఉంది. ఇది ఇప్పుడు నిరుద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. అదే జరిగితే సర్కార్‌పై నిరుద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావం మునుగోడు ఉప ఎన్నికతోపాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా పడే అవకాశం ఉంది.

    KCR

    80 వేల ఉద్యోగాల భర్తీ అన్నారు..
    తెలంగాణలో 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించారు. ఈమేరకు ఆర్థిక శాఖ నుంచి అనుమతులు, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల కూడా విడుదల అవుతున్నాయి. ఇప్పటికే పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కూడా ముగిసింది. అక్టోబర్‌లో గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ జరగనుంది.

    Also Read: Ram Charan- Jr NTR Enter Politics: రాజకీయాల్లోకి ఎన్టీఆర్, రామ్‌చరణ్‌.. పోటీ ఎక్కడి నుంచంటే?

    టెట్‌ నిర్వహణ..
    ఉపాధ్యాయ ఉద్యోగాలకు అర్హత పరీక్ష అయిన టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(టెట్‌)ను కూడా ప్రభుత్వం ఇటీవలే నిర్ణయించింది. పరీక్ష ఫలితాలు కూడా ప్రకటించింది. అర్హులు ఉపాధ్యాయ ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవలే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు గురుకులాల్లో ఉపాధ్యాయ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్‌ కూడా ఇస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్లు కూడా త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. సీఎం ప్రకటించిన నాటినుంచి 52 వేల ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇంకా గ్రూప్‌–2, గ్రూప్‌–4 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్‌ కూడా రావాల్సి ఉంది. నోటిఫికేషన్లు ఎప్పుడైనా రావొచ్చని మంత్రులు ప్రకటిస్తుండంతో నిరుద్యోగులు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు.

    ప్రైవేటు ఉద్యోగాలు మాని..
    ఈసారి కాకుంటే ఇంకెప్పుడూ కాదన్న ఉద్దేశంతో చాలామంది నిరుద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు కూడా మానేసి పట్టణాలకు వెళ్లి చదువుతున్నారు. లక్షలాది మంది యువకులు వేల రూపాయలు వెచ్చించి హైదరాబాద్‌ లోని కోచింగ్‌ సెంటర్లబాట పట్టారు. అయితే.. సీఎం కేసీఆర్‌ ఇటీవల చేసిన ఓ ప్రకటనతో మొత్తం నియామక ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఏర్పడింది.

    నోటిఫికేషన్లు నిలిచిపోయే చాన్స్‌
    సీఎం కేసీఆర్‌ ఈ నెల 17న హైదరాబాద్‌లో బంజారా, ఆదివాసీ భవన్‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఆత్మీయ సభలో రాష్ట్రంలో గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించారు. ఈమేరకు వారం రోజుల్లో నోటిఫికేషన్‌ ఇస్తామని తెలిపారు. అయితే.. ఈ రిజర్వేషన్లు ఇప్పటి నుంచి విడుదల కానున్న నోటిఫికేషన్లకు మాత్రమే వర్తిస్తుందా? లేదా.. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా వర్తిస్తుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లలో గిరిజనులకు 6 శాతం రిజర్వేషన్లను ఖరారు చేశారు. ఇప్పటివరకు ఆర్థిక శాఖ 52,460 ఖాళీల భర్తీకి అనుమతులు ఇవ్వగా.. ఇందులో 6 శాతం రిజర్వేషన్‌ ప్రకారం 3,147 ఉద్యోగాలు గిరిజనులకు దక్కనున్నాయి. సీఎం కేసీఆర్‌ ప్రకటించిన 80 వేల ఖాళీల్లో 6 శాతం రిజర్వేషన్ల ప్రకారం 4,802 ఉద్యోగాలు గిరిజనులు పొందే అవకాశం ఉంది.

    KCR

    మారనున్న రిజర్వేషన్లు..
    సీఎం కేసీఆర్‌ తాజా ప్రకటన మేరకు 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే.. మొత్తం 80 వేల ఖాళీల్లో దాదాపు 8 వేల ఉద్యోగాలు గిరిజనులకు దక్కనున్నాయి. ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసిన 52 వేలకు పైగా ఖాళీల్లో దాదాపు 5,200 ఉద్యోగాలు ఎస్టీలకు లభించనున్నాయి. ఇప్పటి వరకు 20 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల కాగా.. ఇందులోనూ 2 వేలకుపైగా ఖాళీలు గిరిజనులకు లభించనున్నాయి. 6 శాతం రిజర్వేషన్లు అమలయితే మాత్రం ఇందులో దాదాపు 800 మంది నష్టపోనున్నారు. దీంతో గిరిజన రిజర్వేషన్లకు సంబంధించిన జీవో విడుదల ప్రభుత్వానికి కత్తి మీద సాములా మారింది.

    లక్షల మందిపై ప్రభావం..
    గిరిజన రిజర్వేషన్ల పెంపు జీవోతో 80 వేల ఉద్యోగాల్లో లబ్ధి పొందే గిరిజనులు 4 వేలు, కానీ ఈ జీవో కారణంగా నోటిఫికేషన్లు రద్దు చేస్తే మాత్రం లక్షల మంది నిరుద్యోగుపై ప్రభావం చూపుతుంది. దీని ప్రభావం ప్రభుత్వంపై తప్పక పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రిజర్వేషన్లు ఎప్పటినుంచి వర్తింపజేయాలనే అంశం అధికారులకు అంతుచిక్కడం లేదు. ఒకవేళ ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా ఈ రిజర్వేషన్లు అమలు చేస్తే కోర్టు చిక్కులు కూడా వచ్చే అవకాశం ఉంది. చిక్కులు రాకుండా ఉండాలంటే ఆ నోటిఫికేషన్లను కూడా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

    Also Read: Munugodu By Election: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి అతనే.. 

    Recommended videos:

    Tags