Rajamouli And NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు చూస్తే ఆయన ఎంత మంచి నటుడో మనకు అర్థం అవుతుంది. ఇక దర్శకుడు రాజమౌళి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు ఎందుకంటే ఇప్పటికే ఆయన చేసిన సినిమాలు భారీ సక్సెస్ లను రాబట్టడమే కాకుండా తెలుగు సినిమా స్థాయిని ప్రపంచవ్యాప్తంగా చటి చెప్పిన దర్శకుడు గా ఆయన పేరు తెచ్చుకున్నాడు… హాలీవుడ్ మ్యాగజైన్ వెరైటీ 500 జాబితాలో ఎన్టీఆర్, రాజమౌళి ఇద్దరూ కూడా చోటు సంపాదించుకోవడం అనేది ఇండస్ట్రీకి చాలా గర్వ కారణమనే చెప్పాలి.తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో పేరు సంపాదించుకున్న వాళ్లలో వీళ్ళిద్దరూ నిలవడం అనేది నిజంగా విశేషం అనే చెప్పాలి.
అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఇలాంటి జాబితాలో మొట్ట మొదటిసారిగా పేరు సంపాదించుకున్న హీరోగా ఎన్టీఆర్ ఒక సరి కొత్త రికార్డుని క్రియేట్ చేశాడు…ఇక ఇప్పటికే ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తూ మంచి దూకుడు మీద ఉన్నాడు ఇంతకుముందు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్ తో కలిసి ట్రిపుల్ ఆర్ సినిమాలో కూడా నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది…
Also Read: సలార్ సీజ్ ఫైర్ మూవీ ఫుల్ రివ్యూ… హిట్టా? ఫట్టా?
ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది. అలాగే ఈ సినిమా సూపర్ సక్సెస్ అయ్యే దిశగా దర్శకుడు సినిమాను మలుస్తున్నట్టుగా తెలుస్తుంది…అందుకే ఈ సినిమా విషయంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటన పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు గా తెలుస్తుంది…ఇక ఇది ఇలా ఉంటే రాజమౌళి కూడా మహేష్ బాబు తో చేసే సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు.ఇక ఈ సినిమా 2024 సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.
ఇక రాజమౌళి దర్శకత్వంలో సినిమా వస్తుందంటే ఆ సినిమా మీద ప్రేక్షకుడికి విపరీతమైన అంచనాలు ఉండటం కామన్ ఎందుకంటే ఇప్పటివరకు ఆయన తీసిన ఏ సినిమా కూడా ఫ్లాప్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు మహేష్ బాబుతో చేసే సినిమాతో రాజమౌళి పాన్ వరల్డ్ లో తెలుగు సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
Also Read: సలార్ ట్విట్టర్ రివ్యూ: ప్రభాస్ సినిమాకు ఊహించని టాక్, హైలెట్స్ ఇవే