NTR Prashanth Neel movie update: నందమూరి ఫ్యామిలీ మూడోవ తరం హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు జూనియర్ ఎన్టీఆర్…ఆయన తీసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. అందుకే ఆయన ప్రస్తుతమున్న హీరోలందరిలో చాలా ప్రత్యేకంగా నిలుస్తున్నాడు. నటన విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ప్రతిపాత్రలో వేరియేషన్స్ ని చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు… ఇక ప్రస్తుతం తను ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీతో ఎలాగైనా సరే ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క అప్డేట్ కూడా బయటికి రాలేదు. కనీసం గ్లింప్స్ ను కూడా రిలీజ్ చేయడం లేదు. ఈ సినిమా ఈ సంవత్సరం వస్తుంది అనుకుంటే అది కూడా జరిగే విధంగా కనిపించడం లేదు.
ఇక ఏది ఏమైనా కూడా అనవసరంగా ఎన్టీఆర్ ఈ ప్రాజెక్టు చేస్తున్నాడు అంటూ అతని అభిమానులు ఆయన మీద ఫైర్ అవుతున్నారు. కారణమేంటి అంటే ప్రశాంత్ నీల్ ఏం చేస్తున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. ఎన్టీఆర్ లుక్కును సైతం మార్చేశాడు. సన్నబడిన తర్వాత ఎన్టీఆర్ ఏమాత్రం బాలేడు అంటూ అతని అభిమానులే అతన్ని విమర్శిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలో ప్రశాంత్ నీల్ ఎందుకని ఇలా వ్యవహరిస్తున్నాడు.
Also Read: ఉస్తాద్ భగత్ సింగ్ మీద నెగెటివ్ ప్రచారం చేస్తున్నదెవరు..?
ఎన్టీఆర్ తో సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించాల్సింది పోయి ఆ సినిమా షూటింగ్ లేట్ చేస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ ని సైతం డిఫరెంట్ లుక్ లో చూపించాలి అంటూ అతని లుక్కు మొత్తాన్ని మార్చేశాడు… ఇలా అయితే ఈ సినిమా సక్సెస్ అవ్వడం కష్టమే అంటూ పలువురు సినిమా మేధావులు సైతం కామెంట్స్ చేస్తున్నారు…
డ్రాగన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే దానిమీద ఇంకా సరైన క్లారిటీ రాలేదు. కానీ మొత్తానికైతే ప్రశాంత్ నీల్ ఎన్టిఆర్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడు అనే దాని కోసం ఒక వర్గం ప్రేక్షకులు ఎదురు చూస్తుంటే మరి కొంతమంది మాత్రం ఎన్టీఆర్ అనవసరంగా ఈ ప్రాజెక్టు ఒప్పుకున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు…